అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు
పోలవరం పూర్తికి బడ్జెట్‌లో హావిూ
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి వరాల జల్లు కురిపించారు. రాష్టాన్రికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రైతులకు పోలవరం జీవనాడి అని.. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. అలాగే, హైదరాబాద్ ` బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.’ అని విత్త మంత్రి పేర్కొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com