
టెర్రకోటలో కొత్త డిజైన్లు..!!
హస్త కళాకారులకు ప్రత్యేక శిక్షణ
రాయలసీమ న్యూస్: మట్టిలో మాణిక్యాలు టెర్రకోట కుండలు..బొమ్మలు..
వీటి తయారిపై అంగళ్లు సీఎఫ్సీ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల హస్త కళాకారులు తర్పీదు పొందుతున్నారు. హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ (నిఫ్ట్) ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్, టెక్స్టైల్ డిజైనర్, బెస్ట్ క్రియేటివ్ అవార్డు గ్రహీత శావ బాపట్ల సుగుణ రాజు వీరికి హ్యాండి క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడి కళాకారులు వివిధ రకాల బొమ్మలు, కుండలు తయారు చేశారన్నారు. అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ఇక నుండి దేశ విదేశాల్లో డిమాండు ఉన్న డిజైన్లపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 30 మందికి 25 రోజుల పాటు టెర్రకోట బొమ్మల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధానంగా పది కొత్త రకాల బొమ్మలపై ఈ శిక్షణ. ఇస్తున్నామన్నారు. చిన్న సైజు బొమ్మలపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపారు. డిన్నర్సెట్, డెకరేటివ్ పార్ట్స్, కిచెన్ ఐటమ్స్ తదితర డిమాండు ఉన్న రకాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు..
……….