గాంధీ భవన్‌కు.. తెలంగాణ భవన్‌కు తేడా లేదు

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
భాజాపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌ రెడ్డి
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పని చేసి మంచి ఫలితాలు సాధించిన కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది భాజపా ఒక్కటేనని చెప్పారు. గాంధీ భవన్‌కు.. తెలంగాణ భవన్‌కు తేడా లేదని కాంగ్రెస్‌, భారాసలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరుకాగా.. రాష్టాన్రికి చెందిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌, భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. భాజపాకు ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్‌. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. ఆయన సొంత జిల్లాలోనూ భాజపాదే ఆధిపత్యం. పార్టీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరగడం సాధారణ విషయం కాదు. పదేళ్లు పాలించిన భారాస ఒక్క ఎంపీ సీటు గెలవలేక ప్రజాగ్రహానికి గురైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయింది. ఆ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. వంద రోజులు దేవుడెరుగు.. ఎనిమిది నెలలు కావస్తున్నా ఇచ్చిన హావిూలను అమలు చేయలేదు. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ తరహాలోనే కాంగ్రెస్‌ వెళ్తోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, ఇప్పటివరకు ఎందుకు చేయలేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నిరంకుశ పాలనపై విద్యార్థులు, మహిళలు పోరాటాలు చేయలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని, రాజకీయ ఫిరాయింపులే అజెండాగా కాంగ్రెస్‌ పాలిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణను దోపిడీ చేసి ఢల్లీి పెద్దలకు సూట్‌కేసులు పంపుతున్నారని ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్‌ ఓట్లు బిజెపికి పడ్డాయని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుందని, బిఆర్‌ఎస్‌`బిజెపి ఎప్పటికి ఒక్కటి కాదు అని, కాంగ్రెస్‌`బిఆర్‌ఎస్‌ ఒక్కటి అని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీలో చేరికలపై బీజేపీ కార్యవర్గం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుం టామని బండి సంజయ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సమావేశాలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, పార్లమెంట్‌ ఎన్నికల ఇంచార్జ్‌ అభయ్‌ పాటిల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శంషాబాద్‌ మల్లికా కన్వెన్షన్‌లో కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోన్న సమావేశాల్లో లక్ష్మణ్‌, బండి సంజయ్‌, డీకే అరుణ, ఈటల, గరికపాటి తదితరులు పాల్గొన్నారు. అలాగే పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, కార్పోరేటర్లు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం ఇది. భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హావిూలు అమలు చేసేలా ఒత్తిడి తీసికొచ్చే కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం