బేస్తవారిపేట లో రైతు భరోసా కార్యాలయంలో చోరీ

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో స్థానిక రైతు భరోసా కార్యాలయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయం వెనుక వైపు తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఒక ఎల్ఈడి టీవీ. ఐదు సీలింగ్ ఫ్యాన్లు. గ్యాస్ సిలిండర్.పోయ్యు ని దొంగలించటం జరిగింది.ఈరోజు ఉదయం కార్యాలయం సిబ్బంది తలుపులు తెరవగా వెనక వైపు డోరు తెరిచి ఉండటంతో విషయాన్ని గుర్తించి వెంటనే బేస్తవారిపేట ఎస్సై నరసింహారావుకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దొంగలించిన వారు బెస్తర పేట మండల పరిధిలో గ్రామాలలో ఇద్దరు వ్యక్తులు హిందీలో మాట్లాడుతూ పివిపురం ఎస్సీ పాలెం కు వెళ్లి టీవీ ని అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఐ నరసింహారావు తమ సిబ్బందితో గ్రామాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.మార్కాపురం నుండి క్లూస్ టీం రంగప్రవేశం చేయటం జరిగింది.బేస్తవారిపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జె మెర్సీ రాణి మాట్లాడుతూ కార్యాలయంలో దొంగిలించిన వారు నార్త్ ప్రాంతముకు చెందినవారుగా ఉండొచ్చని ప్రతినిధులతో తెలిపారు

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి