
విళ్లివాకం న్యూస్ : ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి వేడుకలు పండుగ శోభతో, ఉత్సాహ భరితంగా ఎంతో ఆనందంగా సాగాయి. ఈ కార్యక్రమానికి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరా దత్ అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె. శ్రీలక్ష్మీ మోహన్ రావు స్వాగతోపన్యాసం అందజేశారు. మారిషస్ తెలుగు మహాసభ తరపున సమాఖ్య మారిషస్ ప్రాంతీయ కమిటీ చైర్పర్సన్ నారాయణస్వామి సన్యాసి విచ్చేశారు. అరుణ శ్రీనాథ్ ప్రార్ధన గీతంతో కార్యక్రమాన్ని ఆరంభించి కోలాటం మరియు బతుకమ్మ కార్యక్రమాలను అందంగా నిర్వహించారు. వక్త కమలాకర రాజేశ్వరిని శిరీష కోక సభకు పరిచయం చేశారు. సంక్రాంతి పండుగ అంశంపై కమలాకర రాజేశ్వరి విషయాత్మకమైన, ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు. ఇందులో ముగ్గుల పోటీ, ప్లేట్ డెకరేషన్ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రేణుక మోహన్ రావు, శాంతిలక్ష్మి వ్యవహరించారు. గ్రూప్ సాంగ్స్ ను అరుణ శ్రీనాథ్, రుక్మిణి దేవి, పి. రమాదేవి, ఝాన్సీ రత్నం, లలితా శ్రీనివాస్ ఎంతో మనోహరంగా ఆలపించారు. సంక్రాంతి క్విజ్ కార్యక్రమాన్ని ఊరా శశికళ చక్కగా నిర్వహించి అందరిని ఉత్సాహపరిచారు. సోది అమ్మ వేషంలో అందంగా అందరినీ అలరించారు. సమాఖ్య మహిళా సభ్యులు కోలాటం, బతుకమ్మ పాటల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. నారాయణ స్వామి సన్యాసి డాక్టర్ విఎల్ ఇందిరా దత్ తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలకు చేస్తున్న సేవలను బట్టి జీవిత సాఫల్య పురస్కారం అవార్డుతో సత్కరించారు.
………