యువత ఆధ్వర్యంలో తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

చెన్నై న్యూస్: యువత సాంఘిక–ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2026 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నై సమీపంలోని పుళల్ కావంగరైలో జరిగింది. సంస్థ న్యాయ సలహాదారుడు డాక్టర్ ఏ.ఎన్. పురుషోత్తం, సలహాదారుడు లయన్ జి. మురళి, దాత ఏ. లక్ష్మీ ప్రసన్న సహకారంతో 2026 తెలుగు క్యాలెండర్ ముద్రణ జరిగింది.
ఈ కార్యక్రమానికి యువత సంస్థ అధ్యక్షులు సిహెచ్. ముకుందరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా లయన్ జి. మురళి పాల్గొని 2026 తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మొదటి ప్రతిని సంస్థ సలహాదారుడు, జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్ జి. మురళిని ఘనంగా సత్కరించారు.

అనంతరం లయన్ జి. మురళి మాట్లాడుతూ, యువత సంస్థ ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధతో యువకులకు ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ తెలుగు క్యాలెండర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. అలాగే యువత సంస్థ 8 సంవత్సరాల నుంచి ముకుందరావు ఈ సంఘమును చాలా జాగ్రత్తగా ఒకరికి సహాయం చేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాడు .దీనికి సహకరిస్తున్న గుడిమెట్ల చెన్నయ్య , ఏఎన్ పురుషోత్తం గారికి మిగతా సభ్యులకు నా ధన్యవాదాలు.
గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, ఎప్పటిలాగే ఈ సంస్థ తెలుగు భాషకు, తెలుగువారి సఖ్యతకు కృషి చేస్తూ, ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. తెలుగు భాషకు వారు చేస్తున్న సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని, తెలుగువారి మధ్య సఖ్యత మరింత విరిసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు పి. నరసింహారావు, కార్యదర్శి ఎం. చిట్టిబాబు, కోశాధికారి ఎం. మునిస్వామి, బి. బాలాజీ, బి. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం