మహనీయుల త్యాగాలు యువతకు చేరాలి: పాతూరి లక్ష్మణరావు

చెన్నై న్యూస్:దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసి, భారతదేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన మహనీయుల త్యాగాలను నేటితరం యువతకు వివరించాలని సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు పిలుపునిచ్చారు.77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నై కొడుంగయూర్‌లోని సీతారామ నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కే. శ్రీనివాస్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సెక్రటరీ పి. లక్ష్మణరావు మాట్లాడుతూ, సంఘం తరఫున ప్రతి ఏడాది 10వ తరగతి మరియు ప్లస్–టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఈ బహుమతులకు అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ దాతగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం మాజీ సంఘ కార్యదర్శి వంజరపు శివయ్య మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, దేశ చరిత్రలో మహనీయుల త్యాగాలను వివరించారు. ప్రతి పౌరుడు తన బాధ్యతలను మర్చిపోకూడదని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఎన్.డి. చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ డి. పిచ్చేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఏ. దుర్గాప్రసాద్, సి.ఎస్. జయకుమార్, జాయింట్ సెక్రటరీ బి. శ్రీధర్, పి. బాలాజీ, కమిటీ సభ్యులు పి.వి. సుబ్బరాజు, డి.యు.వి. నరసింహ రాజు, టి. నాగరాజు, పి. వెంకట వంశీకృష్ణ, డి. సాంబశివరావు, డి.వి. సూర్యనారాయణ, డి. వినోద్ కుమార్, ఎస్. సీతారామరాజు, జె. మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.తెలుగు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం