రామనగర్‌లో వైభవంగా ఆంజనేయ స్వామి ఊరేగింపు

టి నగర్ న్యూస్ :చెన్నై ట్రిప్లికేన్‌లోని శ్రీ రామదాస ఆంజనేయ స్వామి ఆలయంలో 47వ సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం స్వామివారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి ఊరేగింపు గ్రామ వీధుల్లో ఘనంగా ప్రారంభమైంది.

స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి, వాయిద్యాలు మరియు భజన పాటలతో ఊరేగించారు. మంగళ వాయిద్యం, శివ వాక్యం, కేరళ వాయిద్యమైన శింగారి మేళం, మూలకడై చందసేవ భజన, తిరుశంక వాద్యం, తిరువణ్ణావూరు వారి తిరుమల–తిరుపతి పాండురంగ భజన బృందం పాటలు, స్వామి వేషధారణలు, కథాకళి నాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ ఊరేగింపు వేద పండితుల ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది. అనంతరం స్వామివారి ప్రసాదాలు, క్యాలెండర్లను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ రామదాస ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ వారు ఆధ్యాత్మికత, భక్తి భావం పెంపొందే విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాంనగర్ సంక్షేమ సంఘం పెద్దలు, శ్రీ సీతారాముల వారి భక్తజన బృందం, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం