
విల్లివాకం న్యూస్: దుర్గా స్రవంతి సాంస్కృతిక విభాగం, దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభ, చెన్నై ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన విశ్వనాథ సత్యనారాయణ ‘కిన్నెరసాని’ నృత్యనాటిక ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. మధుర కళానికేతన్ నృత్య బృందం స్థాపకులు, నాట్య గురువు కళారత్న డాక్టర్ మాధవి మల్లంపల్లి, (సినీ నటుడు చంద్రమోహన్, రచయిత్రి జలంధర కుమార్తె) ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన జరిగింది. దీనికి మైలాపూర్ లోని ఆంధ్ర మహిళా సభ హాలు వేదికయింది. ముందుగా ప్రార్థన గీతాన్ని వసుంధర ఆలపించారు. స్వాగతోపన్యాసం భారతి చేశారు. దామెర్ల సరస్వతి కళాకారులను పరిచయం గావించారు. విశ్వనాథ వారిపై విశేషాలు లావణ్య చదివి వినిపించారు. కిన్నెరసాని కథ పత్రి అనురాధ, పాటలతో మాటల శైలిని ఎస్ పి వసంతలక్ష్మి సభకు తెలియజేశారు.
ఈ నృత్య ప్రదర్శనలో కళాకారులు డాక్టర్ మాధవి మల్లంపల్లి తోపాటు, డాక్టర్ భావన నారాయణన్, కుమారి లాస్య కానూరు, నితిన్ గణేష్
కుమారి శ్రీకరీ, అనుష్క, వైష్ణవి, తనుశ్రీ, దీపశిఖ, దియా పాల్గొన్నారు.
కార్యక్రమంలో చైర్ పర్సన్ ప్రేమధాత్రి, కార్యదర్శి భానుమతి, డి పద్మావతి, పి జయశ్రీ, లావణ్య శ్రీనివాస్, ఎస్పీ వసంత లక్ష్మి, సత్తిరాజు భారతి, ఆముక్త మాల్యాద, పి అనురాధ, డి సరస్వతి పాల్గొన్నారు. చివరిగా ఆముక్త మాల్యద వందన సమర్పణ చేశారు