ఘనంగా తెలుగు వికాస సమితి ఆధ్వర్యంలో 2026 సం క్యాలెండర్ ఆవిష్కరణ

గుమ్మిడిపూండి న్యూస్ :తెలుగు వికాస సమితి 2026 ఆంగ్ల నూతన సంవత్సరమును పురస్కరించుకొని బిళ్ళాకుప్పం గ్రామంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహిళలకు ముగ్గులపోటీలు మరియు తెలుగు వికాస సమితి 2026క్యాలండరు ఆవిష్కరణ ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి మాచర్ల శాంతా భాస్కర్ అధ్యక్షత వహించగ, గౌరవ అధ్యక్షులు ఎ.వి. రామకృష్ణగారు ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిధులుగా గుమ్మిడిపూండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజర్ దివ్య, గుమ్మిడిపూండి పంజాబ్ నెషనల్ బ్యాంకు మేనేజర్ ఈశ్వర్, గుమ్మిడిపూండి యూనియన్ బ్యాంకు మేనేజర్ అనురాధ పాల్గొన్నారు. ముందుగా తెలుగు వికాస సమితి వ్యవ్సస్థాపక అధ్యక్షులు కీ. శే. సంగరాజు శ్రీరాములు మరియు సమితిని గత పదిహేను సంవత్సరములుగా అభివృద్ధిపథంలో నడిపించి సమీపంలో దివంగతులైన కీ. శే. పోజుల ముద్దుకృష్ణుడు గారికి శ్రద్ధాంజలి ఘటించారు.

మహిళలు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆరణి వివేకానంద పాఠశాల విద్యార్థులు దీప స్తుతి చేసారు. గుమ్మిడిపూండి శ్రీ నాట్యాలయ మరియు ఎం. బి. ఎస్ వివేకానంద పాఠశాల విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన ప్రజలను పరవశింపజేసింది.

సభా కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోసు గజేంద్రబాబు ప్రార్ధనాగీతాన్ని ఆలపించగా, కార్యదర్శి వెలుగుల కృష్ణ మోహన్ స్వాగతం పలికారు. ముళికి షణ్ముఖం సమితి సమాచారాన్ని తెలియజేయడంతో పాటు కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ బిళ్ళాకుప్పం గ్రామం వంద శాతం తెలుగు మాట్లాడే తెలుగు పల్లె అని తెలుగు కార్యక్రమాన్ని ఈ గ్రామంలో జరపడం సంతోషంగా ఉందని తెలియజేసారు. ఆంగ్ల నూతన స్వాగత గీతాన్ని కిన్నెర ప్రకాష్ ఆలపించగా,
2026 సంవత్సర తెలుగు వికాస సమితి క్యాలండరును ముఖ్య అతిధి, దాత మరియు విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్. సంగరాజు విష్ణువర్ధన్ గారు క్యాలండరును ఆవిష్కరించి , చెన్నై శ్రీ త్యాగరాయ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిచంద్రబాబుకు తొలి ప్రతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయం ముగ్గుల పోటీలలో పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులను , అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులకు నోటుపుస్తకముల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందజేయడం జరిగింది.

వందన సమర్పణ కోశాధికారి మన్నే శ్రీహరి తెలియజేసారు ఈ కార్యక్రమంలో వెంకటేష్, న్యాయవాది సురేష్ బాబు, కృష్ణ శ్రీతన్, మునిరత్నం, మన్ని వెంకటేశ్వరులు, మన్ని అమరలింగం, పలువురు తెలుగు భాషాభిమానులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం