21 ఏళ్ల తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన టెస్ట్ అరంగేట్ర సిరీస్‌లోనే అద్భుతమైన ప్రదర్శన చేసి తొలి సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్, భారత ఇన్నింగ్స్‌కు ఊపిరి పోశాడు.
నితీశ్ సెంచరీ: భారత్‌ను ఫాలో ఆన్ ముప్పు నుంచి కాపాడిన ఇన్నింగ్స్
భారత టాప్ ఆర్డర్ విఫలమైన తరువాత, నితీశ్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి నిలకడగా ఆడి, టీమ్‌ను ఫాలో ఆన్ ముప్పు నుంచి బయటకు తీసుకువచ్చాడు. 171 బంతుల్లో 100 పరుగులు సాధించిన నితీశ్ ఈ ఇన్నింగ్స్‌తో తాను మాత్రమే కాకుండా, టీమ్‌కి కూడా సహాయపడాడు.
అంతకుముందు పెర్త్ టెస్ట్‌లో ఒంటరి పోరాటం
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా నితీశ్ తన ఆటను రుజువు చేశాడు. 59 బంతుల్లో 41 పరుగులతో ఇన్నింగ్స్‌కు నిలువునా పోరాడిన నితీశ్, అప్పుడు కూడా కీలక పాత్ర పోషించాడు.
ఆరంభం నుంచి నితీశ్ ప్రయాణం
నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన యువ క్రికెటర్. 2003 మే 26న జన్మించిన నితీశ్ 2023లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి, 2024 సీజన్‌లో 142 స్ట్రయిక్ రేట్‌తో 303 పరుగులు చేయడమే కాకుండా మూడు వికెట్లు కూడా తీశాడు. అలాగే, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబయి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి గుర్తింపు పొందాడు.
క్రికెట్ ప్రముఖుల అభిప్రాయాలు
నితీశ్ ఆటతీరుపై ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ మాట్లాడుతూ, “నితీశ్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. హర్దిక్ పాండ్యా తరహా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పరిగణించవచ్చు,” అని అభిప్రాయపడ్డారు.
తెలుగు క్రికెటర్ హనుమ విహారి కూడా నితీశ్ గురించి మాట్లాడుతూ, “అతని టాలెంట్ అరుదైనది. అతనిపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాలి,” అని అన్నారు.
నితీశ్ తీపి విజయంతో తెలుగు ప్రజలకు గర్వకారణం
టెస్ట్ క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమైంది. అతని ఆటతీరుపై క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో తన దశల మూలాన భారత జట్టులో మరింత కుదురుగా నిలవడం కోసం నితీశ్ ఎలాంటి విజయాలు సాధిస్తాడో చూడాలి.
నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నజరానా!
ఇడియన్ క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అయిన నితీశ్ కుమార్ రెడ్డి కు అభినందనలు తెలిపిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్..
ఏసిఏ తరుఫున యువ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు ప్రకటించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తామన్న ఏసిఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్.. నితీశ్ కుమార్ రెడ్డి ఇండియా క్రికెట్ టీమ్ తరుఫున ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేందుకు ఎంపిక కావటం శుభపరిణామం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నాడు
నితీశ్ కుమార్ రెడ్డి లాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తాం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియం సిద్ధం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ACA ఆలోచన చేస్తోంది.