Search
Close this search box.

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో అంగరంగ వైభవంగా ‘‘తెలంగాణ భాషా దినోత్సవం’

నెల్లూరు న్యూస్: కాళోజీ నారాయణరావు గారిని తెలంగాణ భాషా మాండలిక తత్త్వవేత్తగా అభివర్ణించవచ్చని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు 110 వ జయంతిని పురస్కరించుకుని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సెప్టెంబర్ 9న ‘తెలంగాణ భాషా దినోత్సవంపై జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆచార్య తంగెడ కిషన్ రావు హాజరై కాళోజీ నారాయణ రావుగారితో వారిగల అనుబంధాన్ని ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. నారాయణరావుగారు ప్రజాక్షేమం కోసం అహర్నిశలూ పరితపించిన గొప్ప ఉద్యమ కారుడని కొనియాడారు. అంతేకాదు తెలంగాణ భాషాదినోత్సవాన్ని ఈనాడు నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కవి, విమర్శకులైన డా. ఏనుగు నరసింహరెడ్డి విశిష్ట అతిథిగా విచ్చేసి తెలుగుభాషా ప్రాభవ, వైభవాల్ని గూర్చి శాస్త్రీయంగా మాట్లాడారు. భాషను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముఖ్యంగా ఇలాంటి కేంద్ర ప్రభ్యుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు విశేషంగా అధ్యయనం గావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. నేడు మాతృభాషా ఎదుర్కొంటున్న సవాళ్ళను వారు లెక్కలతో సహ వివరించారు. తదనంతరం గౌరవ అతిథిగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు తెలుగుభాషా వైవిధ్యాన్ని సాంగోపాంగంగా తెలియపరిచారు. ఈ జాతీయ సదస్సును ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఉపయోకరంగా నిర్వహించడానికి విశేషమైన కృషిని సలిపారు. వీరు ‘తెలంగాణ ఉద్యమకవి’ కాళోజీ నారాయణ రావు జయంతిని గుర్తుచేసుకుంటూ తెలంగాణ భాషా అస్తిత్వాలకు సంబంధించిన ఆయా అంశాలపై పలువురి ప్రముఖుల్ని ఆహ్వానించి ప్రసంగింపజేయటం చాలా మెచ్చుకోదగింది. అనతంతరం కాళోజీ ఉద్యమ జీవితంపై డా. కరిమిండ్ల లావణ్య, తెలంగాణ కథా సాహిత్యం – భాషా అస్తిత్వంపై డా. ఎస్. రఘు, తెలంగాణ ఉద్యమ కవిత్వం – కాళోజీ పాత్ర పై డా. ఎం. కృష్ణయ్య, కాళోజీ కవితా దృక్పథం పై డా. కె. విల్స్‌న్ రావు గార్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం విద్యా, కార్యనిర్వాహణ సిబ్బంది, నెల్లూరు సాహితీ పిపాసకులు, డా. మల్లెలరామయ్య నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేశారు.


………………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి