కాన్వాయ్‌ ఆపి వినతుల స్వీకరణ

పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తా

సిఎం చంద్రబాబు నాయుడు వెల్లడి

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను వీలైనంత త్వరగా నెరవేర్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నిత్యం శ్రమిస్తున్నారు. అధికారులతో సవిూక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. అలాగే ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని త్వరిగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్‌కు వెళ్తుండగా అక్కడ ఉన్న ప్రజలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ ఆపారు. నివాసం నుంచి కాన్వాయ్‌ బయటకు వచ్చిన వెంటనే రోడ్డుపై వినతి పత్రాలతో జనం నిలబడి ఉన్నారు. వారిని కార్‌లో నుంచి చూసిన చంద్రబాబు ముందుకు వెళ్తూ కాన్వాయ్‌లో తన కార్‌ ఆపివేయించారు. అనంతరం కారు దిగి… అందరి వద్దకు వెళ్లి వినతి పత్రాలు తీసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు చంద్రబాబు హావిూ ఇచ్చారు. అలాగే పార్టీ ఆఫీస్‌లో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామని అక్కడకు వెళ్లి కూడా ఇవ్వొచ్చని ఈ సందర్భంగా ప్రజలకు చంద్రబాబు చెప్పారు. తమను చూసి సీఎం చంద్రబాబు కారు దిగి వినతి పత్రాలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం