Search
Close this search box.

స్మార్ట్‌ సిటీ స్కేటింగ్‌ టెండర్లు రద్దు చేయాలి…!! దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి..

కాకినాడ,  జూన్‌ 28 : రూ.9కోట్లు వెచ్చించి నిర్మించిన కుళాయి చెరువు ఈశాన్యం ఆవరణలోని వై.ఎస్‌.ఆర్‌ ఇండోర్‌ స్కేటింగ్‌ సెంటర్‌ షెడ్‌ నిర్వహణను రూ.21 లక్షల టెండరుకు దారాదత్తం చేయడం అత్యంత దారుణమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్కేటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు అనుమతిలో పూర్వ మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం ద్వారా ఆసక్తి కలిగిన తెలుపు రేషన్‌ కార్డు దారుల పిల్లలకు ఉచితంగా స్కేటింగ్‌ నేర్చుకునే అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. 15వేల రూపాయల ఫీజులతో ఖరీదైన స్కేటింగ్‌ పరికరాల అమ్మకాలతో ఉచిత కరెంటు, ఉచిత పారిశుద్ధ్యం, ఉచిత సౌకర్యాలతో నెలకు రూ.50లక్షల ఆదాయాన్ని పొందుతున్న స్కేటింగ్‌ నిర్వహణను కంటి తుడుపుగా రూ.21లక్షలకు దిగదుడుపు చేయడం అత్యంత అవినీతికి పరాకాష్టగా వుందన్నారు. అప్పట్లో కరోనా లాక్‌ డౌన్‌ నందు కమీషనర్‌ స్వప్నిల్‌ హయాంలో కుళాయి చెరువు ఈశాన్యంలో వాకింగ్‌ ట్రాక్‌ మార్గం దారి మళ్లించి చెరువు కప్పేట్టిన అధికారుల తీరు దురదృష్టకరమన్నారు. 9కోట్లు బ్యాంకులో వేసినా స్కేటింగ్‌ నిర్వహణలో భారం పడుతున్న 5లక్షల అదనపు ఖర్చులు లేకుండా 18లక్షల ఆదాయం వస్తుందన్నారు. పి.ఆర్‌ కాలేజీ వద్ద రోడ్డు మీద విద్యాసంస్థ ప్రహారీ ఆక్రమణతో ఏర్పాటు చేసిన ఈట్‌ స్ట్రీట్‌ నిర్వహణను ఇదే రీతిగా అప్పనంగా అప్పగించి దళారులు లక్షల్లో దోచుకునే అవకాశాన్ని కార్పోరేషన్‌ కల్పించిందన్నారు. విచారణ జరగాల్సిన అవసరం వుందన్నారు. టెండర్లు రద్దు చేసి రికార్డులు పరిశీలించి కార్పోరేషన్‌కు భారం లేకుండా క్రీడా ప్రగతి కల్పించాల్సిన బాధ్యత వహించాలని పౌర సంఘం కన్వీనర్‌ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు డిమాండ్‌ చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి