విల్లివాకం న్యూస్: ఎస్కేపిడి బాలుర ప్రాథమిక మరియు మహోన్నత పాఠశాల ఆధ్వర్యంలో 107వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఎస్ కెపి కళాశాల ఇండోర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ సి సతీష్ విచ్చేశారు. గౌరవ కరస్పాండెంట్ ఎస్ ఎల్ సుదర్శనం, ఊటుకూరు శరత్ కుమార్, దేసు లక్ష్మీనారాయణ, సోలేటి చంద్రశేఖర్, సి.సతీష్, సిఆర్ కిషోర్ బాబు, టి బద్రీనాథ్, ఎస్కేపిడి బాలుర మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఒ. లీలారాణి, ఎస్కెపిడి ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇ.రమేష్, పాల్గొన్నారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం పాఠశాల విద్యార్థినులు ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. సోలేటి చంద్రశేఖర్ స్వాగతోపన్యాసం చేశారు. ఒ.లీలారాణి, ఇ.రమేష్ లు వార్షిక నివేదికలు చదివి వినిపించారు. ముఖ్య అతిథి సి. సతీష్ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థినైన తాను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను రోల్ మోడల్స్ గా తీసుకోవాలని అన్నారు. విద్యపై ధ్యాస ఉంచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. గురువులను గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యలో రాణించే పాఠశాల విద్యార్థికి తన వంతుగా 25 వేల రూపాయలను క్యాష్ ప్రైజ్ గా అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఏడాది పాఠశాల పిల్లలకు హెల్త్ చెకప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఊటుకూరు శరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఇక్కడ చదివి అభివృద్ధి చెందిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అలాగే దేసు లక్ష్మీనారాయణ, సిఆర్ కిషోర్ బాబు, టి బద్రీనాథ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్ కే పి డి పాఠశాలల వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులను సత్కరించారు. వాఖ్యాతగా ప్రజ్వల్ వ్యవహరించారు. ఇందులో బహుమతుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
…………..