ఘనంగా కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబరాలు’

విళ్లివాకం న్యూస్: కాపు సేవా సమితి, చెన్నై ఆధ్వర్యంలో ‘సంక్రాంతి సంబరాలు’ ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. దీనికి చెన్నై, అన్నానగర్, 6వ మెయిన్ రోడ్డులో గల శ్రీకృష్ణస్వామి మహిళా కళాశాల ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఆకుల ప్రకాష్ అధ్యక్షత వహించి 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.

ముఖ్య అతిథిగా విద్యావేత్త పి.యం కన్నదాసన్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా కృష్ణస్వామి మహిళా కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నళిని పాల్గొన్నారు. ఇందులో లక్కీ డిప్ ఈవెంట్, రంగోలి, పాటల పోటీలు, కుకింగ్ పోటీలు జరిగాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.

భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంస్థ అధ్యక్షులు గూడపాటి జగన్మోహనరావు స్వాగతం ఉపన్యాసం చేశారు. ప్రధాన కార్యదర్శి పి.ఆర్ కేశవులు ప్రార్థన గీతం ఆలపించారు.నారాయణ పెరల్స్ అధినేత కొట్టే వెంకట నారాయణ , పారిశ్రామికవేత్త సత్యనారాయణ, బేతి రెడ్డి శ్రీనివాస్ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆధ్యాంతం ఎంతో ఉత్సాహంగా, హుషారుగా సాగింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం