ఏటా వర్షాకాలంలో నీట మునగడం ఆనవాయితీ
పాండవులచే ప్రతిష్టించినట్లు ప్రచారం జరుగుతున్న సప్త నదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం అయ్యారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. దీంతో నీటి మట్టం పెరగడంతో సంఘమేశ్వరాలయం లోని వేపదారు శివలింగమును కృష్ణా జలాలు తాకాయి . కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వరాలయం గత ఏడాది డిసెంబర్ 11వ తేదీ శ్రీశైల జలాశయం కృష్ణా జలాల్లో నుండి బయటపడిరది. తిరిగి ఇప్పుడు జులై 23వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించాయి. దాదాపు 258 రోజులు పాటు భక్తులకు దర్శనమించిన వేపదారు శివలింగాన్ని కృష్ణ జలాలు తాకాయి. గంగమ్మకు చీర సారే సమర్పించి గర్భాలయంలోని వేపదారు శివలింగం కు ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించిన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు. గత సంవత్సరం జూలై 30వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు రాగా డిశంబరు 11వ తేదీ ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు. డిసెంబర్ 11 నుండి నేటి వరకు దాదాపు 258 రోజులు పాటు భక్తుల పూజల అందుకున్నారు సప్త నదుల సంగమేశ్వరుడు. ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లల్లో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి 8 నెలలు బయట ఉండడం విశేషం. మళ్ళీ స్వామి వారి దర్శనం ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 840 అడుగుల నీటిమట్టం ఉండగా ఈ నీటిమట్టం 85క్ష అడుగులకు చేరుకుంటే సంఘమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లనుంది. మళ్లీ స్వామి అమ్మవార్ల దర్శనం కలగాలంటే 8 నెలలు వేచిచూడాలి భక్తులు.
సంగమేశ్వరాలయం ఆలయం విశేషం ఏమిటంటే.. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుంటుంది. మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగంను భీముడు ప్రతిస్టించాడని పురాణాలు చెబుతున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది.