ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు

 కొత్త ఇసుక పాలసీకి ఆమోదం 

 ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు 

మహిళలకు ఫ్రీ బస్సు అమలుపై ప్రణాళి

పౌరసరఫరాలశాఖ 2 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ

22నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ

ఎపి కేబినేట్‌ భేటీ నిర్ణయాలను వెల్లడిరచిన పార్థసారథి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన కేబినెట్‌ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో హావిూ ఇచ్చినట్టే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ విధి 

విధానాలు రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే ప్రణాళికలపై కూడా కేబినెట్‌లో చర్చించారు. పౌరసరఫరాల శాఖ 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు.. కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3 వేల 200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మధ్య ప్రభుత్వం వరుసగా రిలీజ్‌ చేసిన శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలు, పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. లోటు బ్జడెట్‌ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని.. శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతినెలా సవిూక్ష చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్‌ అండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి వెల్లడిరచారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి విూడియాకు వెల్లడిరచారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్టాల్రే అమలు చేయలేదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎవరితో చర్చించకుండానే చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. నీతిఅయోగ్‌ ప్రతిపాదిత చట్టానికి, గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సంబంధం లేదని వివరించారు. ఈ చట్టం వివాదాలను పెంచే విధంగా ఉందని, ప్రజలకు మేలు చేసేదిగా లేదని అన్నారు. రెవెన్యూ, రిజిస్టేష్రన్‌, ల్యాండ్‌ రికార్డ్సు వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుకపై కమిటీ వేసి పర్యవేక్షణ చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ఇసుకపై గత ప్రభుత్వం కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. పాత ఇసుక విధానం, పలు ఒప్పందాలు రద్దు చేశామని తెలిపారు.ªూష్ట్రంలో కౌలు రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. కౌలు రైతుల సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామన్నారు. రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన సాగును అందుబాటులోకి తీసుకు రానున్నామని వివరించారు. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన మంత్రి వర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, సీఎస్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం