
విల్లివాకం న్యూస్ : నిస్వార్థసేవలందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేల్ వెల్లడించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సిఎస్, టామ్స్ ప్రధాన కార్యాలయ కార్యదర్శి సిఇ తిరుమల రావు 50వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చెన్నై వేపేరి లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్ఆర్డి సెంటర్లో టామ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయ్ కుమార్ లు సారథ్యం వహించారు. ఆహూతుల సమక్షంలో తిరుమల రావు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు .ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేల్ మాట్లాడుతూ నగర పురపాలక సంఘంలో అధికారిగా, టామ్స్ నిర్వాహకుడిగా తిరుమల రావు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదనపు కార్యదర్శి గుర్రం చిన్న నాగూర్,
జిసిసి సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఎం తిరుపాల్, అఖిల భారత తెలుగు సమాఖ్య, ప్రధాన కార్యదర్శి నాయకర్ ఆర్ నందగోపాల్, ఐజేకే నేత మన్నం రవిబాబు సహా టామ్స్, జనోదయం నిర్వాహకులు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని తిరుమల రావుకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
………………..
One Response
బాగుంది…