చెన్నై న్యూస్: బారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీ పడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కొక్క విజయం సాధించిన ఇరు జట్లు ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టును ఆడుతున్నాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ సందర్భంగా భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ తమ అధికారిక X వెబ్సైట్లో ఈ ప్రకటనను విడుదల చేసింది.
అశ్విన్ కెరీర్లో విశేషాలు
2010లో భారత జట్టుకు అరంగేట్రం చేసిన అశ్విన్, ఇప్పటివరకు 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తం 765 అంతర్జాతీయ వికెట్లతో క్రికెట్ చరిత్రలో అతను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
టెస్టుల్లో 474 వికెట్లు
వన్డేల్లో 151 వికెట్లు
టీ20ల్లో 140 వికెట్లు తీసిన అశ్విన్, 5 సార్లు టెస్టుల్లో సెంచరీలు కూడా సాధించాడు.
అశ్విన్‌కి శుభాకాంక్షలు
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులు, వివిధ పార్టీల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతని సేవలు భారత క్రికెట్‌ను కొత్త ఉన్నత శిఖరాలకు చేర్చాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో అశ్విన్ కోచ్ లేదా విశ్లేషకుడిగా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించే అవకాశమున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.