
అమరావతి: సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప-2 విడుదలకు ముందే టికెట్ ధరల పెంపు పెద్ద చర్చగా మారింది. థియేటర్ యాజమాన్యాలు ప్రీమియర్ షోతో పాటు మొదటి రెండు వారాలపాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతిని పొందాయి.
ప్రీమియర్ షో టికెట్ ధరలు 800 రూపాయలకు?
డిసెంబర్ 4న రాత్రి 9:30కు ప్రదర్శించే పుష్ప-2 ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800గా నిర్ణయించబడింది. అలాగే, డిసెంబర్ 5 నుంచి 17 వరకు రెండు వారాల పాటు మల్టీప్లెక్స్‌లలో రూ. 200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్‌కు రూ. 100, అప్‌పర్ క్లాస్ టికెట్‌కు రూ. 150 వరకు ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
ఇండస్ట్రీకి మేలు చేస్తుందనోనా..
ఈ నిర్ణయం నేపథ్యంలో పుష్ప-2 హీరో అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరింత అభివృద్ధి కలిగిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పెద్ద చిత్రాలకు ఇది తోడ్పడుతుందని బన్నీ అభిప్రాయపడ్డాడు.
ఈ టికెట్ ధరల పెంపు వల్ల ప్రేక్షకులకు కొంత భారం అయినప్పటికీ, పెద్ద సినిమాల బడ్జెట్‌లు అందరికీ చేరవడంలో ఇది కీలకంగా మారనుంది.