గుజరాత్‌లో విమాన ప్రమాదం – ప్రయాణికుల పరిస్థితి అనిశ్చితం

చెన్నై న్యూస్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 1.17 గంటలకు లండన్‌కు బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతంలో జరిగింది.

విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకున్నది. అగ్నిమాపక, పోలీసు బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికులూ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం