
కోడంబాకం న్యూస్ర్:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ నుంచి కీలక అప్డేట్ విడుదలైంది. మొదట ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభించగా, కొన్ని కారణాల వల్ల మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
తాజాగా ఈ చిత్ర బృందం పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించిన ‘మాట వినాలి’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. పాటలో పవన్ కల్యాణ్ విజువల్స్ ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాయి. ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యం అందించగా, దీనికి కీరవాణి తన సంతకాన్ని పాట ద్వారా మరింత గాఢంగా ముద్రించారు. విడుదలైన వెంటనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
‘హరి హర వీరమల్లు’ మొత్తం రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ‘ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్రంలో నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్‌కు జోడీగా నటిస్తుండగా, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడ్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాటతో పాటు చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.