ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్‌ కన్నుమూత

కోడంబాకం న్యూస్ :దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవీ మేయప్పన్ కుమారుడైన శరవణన్, తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మించారు. ఏవీఎం బ్యానర్‌పై వివిధ భాషల్లో సుమారు 176 సినిమాలను ఆయన నిర్మించారు.

 

తెలుగులో “సంసారం ఒక చదరంగం”, “లీడర్”, “జెమినీ” వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో “శివాజీ”, “మెరుపు కలలు” వంటి బ్లాక్‌బస్టర్‌లను ఆయన అందించారు. సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సీరియళ్లను కూడా నిర్మించారు. 2014లో వచ్చిన “ఇదువుమ్ కదాందు పొగుమ్” ఈ బ్యానర్‌లో వచ్చిన చివరి చిత్రం. ఆ తర్వాత 2022లో అరుణ్ విజయ్ హీరోగా “తమిళ్‌రాకర్స్” అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు.

శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

……….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం