నిబద్ధత, నిజాయితీకి మారుపేరు నల్లి కుప్పుస్వామి

విల్లివాకం న్యూస్: పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి నిబద్ధత, నిజాయితీకి మారుపేరని పలువురు వక్తలు వెల్లడించారు. బ్రహ్మ గాన సభ ఆధ్వర్యంలో పద్మశ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టియార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో ఆరు పుస్తకాల ఆవిష్కరణ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై ఆర్ఎ పురం, చెట్టినాడు విద్యాశ్రమ్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్, డైరెక్టర్, ఎన్ రవి అధ్యక్షత వహించారు. మద్రాసు యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్, ప్రొఫెసర్, హెచ్ఒడి, డాక్టర్ వై మణికండం మొదటి ప్రతులను అందుకున్నారు. అనంతరం ఆయన నల్లి ది మాన్ ది బ్రాండ్, జ్ఞానం తంద జ్ఞానానందర్, సహృదయ నల్లి, తేన్ గూడు తదితర పుస్తకాల గురించి వివరించారు. ఇందులో నల్లి కుప్పు స్వామి మంచితనం, నిరాడంబరత గురించి కొనియాడారు. విద్యాదాతగా, అనేకమంది జీవితాలకు వెలుగునిచ్చిన స్ఫూర్తి ప్రదాతగా పేరు గడించినట్లు తెలిపారు. డాక్టర్ ఆర్ నటరాజన్ మాట్లాడుతూ నల్లితో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో సహృదయ నల్లి పుస్తకావిష్కరణ జరిగింది. దీనిని ఎన్ వి సుబ్బారావు అనువదించారు.

గోటేటి వెంకటేశ్వరరావు ప్రముఖాంద్ర తరపున పబ్లిష్ చేశారు. పీఎం హేమావతి, ఎస్ రవిచంద్రన్, నటుడు పార్దిపన్, తదితరులు హాజరయ్యారు. ఈ
కార్యక్రమంలో నగరానికి చెందిన అనేకమంది తమిళ, తెలుగు ప్రముఖులు పాల్గొని నల్లి కుప్పు స్వామిని సత్కరించారు. అలాగే , నల్లి కుప్పు స్వామి తనకు సహకరించిన అందరిని ఉచిత రీతిన సత్కరించారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి