ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. ఈకామర్స్ మొదలు సోషల్ మీడియా వరకు అన్ని రంగాలు ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు సేవలను అందుబాటులోకి తీసుకురాగా. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా సైతం ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటా సంస్థ రూపొందించి ఏఐ అసిస్టెంట్.. ‘మెటా ఏఐ’ భారత్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు మెటా.ఏఐ పోర్టల్‌లో ఈ మెటా ఏఐని ఉపయోగించుకోవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు మెటా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మెటా లామా3 ఎల్‌ఎల్‌ఎం ఆధారిత ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా. తాజాగా ఇది భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
ఇకపై మెటా యూజర్లు తాము ఉపయోగిస్తున్న యాప్స్ నుంచి బయటకు రాకుండానే.. కంటెంట్ క్రియేషన్‌తో పాటు టాపిక్స్‌పై లోతైన సెర్చింగ్ కోసం ఉపయోగపడనుంది. దీంతో కంటెంట్ క్రియేషన్, సెర్చ్ కోసం యూజర్లు ఇతర యాప్‌ల జోలికి వెళ్లకుండా ఉంటుందని మెటా భావిస్తోంది. భారత యూజర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇంతకీ ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుందనేగా మీ సందేహం. ఉదాహరణకు మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో మీకు దగ్గరల్లో ఉన్న రెస్టారెంట్స్ గురించి తెలుసుకోవాలకున్నారు. ఇతర సెర్చ్ ఇంజన్స్‌లోకి వెళ్లకుండా నేరుగా వాట్సాప్ చాట్‌లోనే మీకు దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేనా మీకు కావాల్సిన ప్రతీ సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఇక ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న సమయంలో.. మీకు కావాల్సిన ఫీడ్‌ను వెతికిపెట్టడంలో మెటా ఏఐ ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్ ఫీడ్‌లో మీరు ఏదైన పర్యటక స్థలానికి సంబంధించిన ఫొటో చూస్తే.. అక్కడికి ఎలా వెళ్లాలి.? ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఏఐ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకోవచ్చన్నమాట.