Search
Close this search box.

కెసిఆర్‌ పోరాటం రామాయణమంత

తెలంగాణ శాసించే స్థాయిలోనే ఉండాలి

యాచిస్తే కేంద్రం పట్టించుకోదు

అనేక సందర్భాల్లో కేంద్రంతో పోరాడం

బడ్జెట్‌ విక్షపై జరిగిన చర్చలె కెటిఆర్‌

కేంద్రంపై కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన పోరాటం రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకుంటే భారతమంత అని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’దేశ అత్యున్నత సభ పార్లమెంట్‌. ఏపీ పునర్విభజన చట్టం ఏదైతో ఉన్నదో అందులో రెండురాష్టాల్రకు హావిూ ఇచ్చారు. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణకు హావిూలు ఇచ్చారు. 35పైగా హావిూలు ఇచ్చారు. ఒక రాష్టాన్రికి చేయూతనిచ్చి.. మరో రాష్టాన్రికి మొండిచేయిచూపడం అన్యాయం. పక్కవారు బాగుపడితే సంతోషపడుతాం. ఆంధ్ర రాష్టాన్రికి డబ్బులు ఇచ్చారు సంతోషం. మనకు ఇవ్వలేదనే తెలంగాణలోని ప్రతిబిడ్డలో ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్నచూపా అనే బాధ తప్పకుండా ఉన్నది. తెలంగాణ హక్కులను ఎవరు హరించినా.. ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో వారి మెడలు వంచే బాధ్యత.. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా.. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీగా బీఆర్‌ఎస్‌దేననే మాట గుర్తు చేస్తున్నాను. కేసీఆర్‌ పోరాట పటిమ.. చేసిన కార్యక్రమాలు చెప్పాల్సి వస్తే.. పదేళ్లు కేంద్రంపై చేసిన ప్రయత్నాలు చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణమంతా.. చెప్పుకంటే భారతమంతా అంత కథ ఉన్నది. తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత మావిూద ఉన్నదని భావిస్తున్నాం’ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డదో లేదో.. సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణలోని ఏడుమండలాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఆనాడు పోలవరం ముంపులో ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటిగా స్పందించింది.. రాష్ట్రం బంద్‌కు పిలుపునిచ్చింది.. ఆ నాటి మా పార్టీయే. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడిరది మేమే. 2014, సెప్టెంబర్‌ 7న కేసీఆర్‌ ప్రధానిని కలిసి తెలంగాణ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి.. హోదా ఇవ్వండని కోరారు. ఒకసారి కాదు 1.15లక్షల కోట్లు రాష్టాన్రికి ఇవ్వాలని సీఎంగా కేసీఆర్‌ ఆ నాడు 2016 ఫిబ్రవరి 12లో కోరారు. ఇలా ఎన్నో సందర్భాల్లో కలిశాం. ఒక్కసారి కాదు.. ఎక్కని కొండ లేదు.. మొక్కని బండలేదు అన్నట్లు ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్రం వద్దకు పలుసార్లు పోయాం. కొన్ని సాధించాం.. కొన్ని సాధించలేకపోయాం. రకరకాల ప్రయత్నాలు చేశాం. వివక్షపూరిత వ్యవహారం చేసినప్పుడు సీఏఏ, ఎన్‌పీఏ, ఎన్‌ఆర్‌సీలాంటి విషయాల్లో తెలంగాణ శాసనభలో తీర్మానాలు ప్రవేశపెట్టి పాస్‌ చేసి కేంద్రానికి నిరసన తెలిపాం. విద్యుత్‌ చట్టం తెచ్చి మోటార్లకు విూటర్లు పెట్టాల్సిందేనని మెడపై కత్తిపెడితే దాన్ని వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం చేశాం. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో నిరసన తెలిపాం. ఈ సందర్భంగా ప్రసంగానికి భట్టి విక్రమార్క అడ్డు తగిలారు. దీనికి స్పందిస్తూ వివక్ష ఇవాల్సింది కాదు పదేళ్లది’ అన్నారు. పెండిరగ్‌ సమస్యలను పరిష్కరించాలన్నా లెక్కలేదు. ఓబీసీ గణన కావాలని స్టేట్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. ఆఖరికి కేంద్రం రైతుచట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేస్తే పార్లమెంట్‌లో నిరసన తెలిపాం. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే విూకెందుకు ఇబ్బంది ? ఏం చెప్పాలో పంపండి. మాట్లాడుతాం. ఏం మాట్లాడాలో విూరే చెబుతారా? ఇది టూమచ్‌. నేను సీనియర్‌ సభ్యుడిని. ఐదుసార్లు గెలిచివచ్చాను. ఏం మాట్లాడాలో తెలుసు. హౌస్‌లో ఎలా ఉండాలో తెలుసు. ఈ రకంగా డిక్టేట్‌ చేయడం సరికాదు. మా పార్టీ పరంగా గతపదేళ్లు ప్రభుత్వంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే మొత్తం కేబినెట్‌ సీఎంతో సహా.. నూకలు తినండి అంటే ఢల్లీిలో ధర్నా చేసి వచ్చిన వాళ్లం. మాకు ఏం కొత్తకాదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది టీఆర్‌ఎస్‌ ఎంపీలు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీలో ఇక్కడ మాత్రమే కాకుండా ఢల్లీిలో నిరసన తెలిపింది మా ఎంపీలే’నన్నారు. కంటోన్మెంట్‌ విషయంలో కేంద్రం ఇబ్బందిపెడుతుంటే వాటిని లేవనెత్తింది మేమే. కోటి ఆశలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్‌లో నిన్న అన్యాయం జరిగింది. రేవంత్‌రెడ్డి చిన్న వయసులోనే సీఎం అయ్యారు. కష్టపడి వచ్చారు. సంతోషం. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు. ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిశారు. కలిసి ఎన్నో విజ్ఞాపనలు చేశారు. మేం ఇచ్చినట్లే విూరు రేవంత్‌రెడ్డి వినపత్రాలు ఇచ్చారు. కానీ, న్యాయం విూకు జరుగలేదు. మేం మొదటి చెప్పేది అదే. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఎప్పుడూ చెప్పేవారు. యాచిస్తే రాదు తెలంగాణ.. శాసిస్తే తెలంగాణ వస్తది చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాం. శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి. ఆనాడు సహకారం అందించినా,.. సమరం సాగించినా తెలంగాణ ప్రయోజనాలకే. ఏ రకమైన లాలూచి.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీపడలేదు. ఏడుమండలాలు గుంజుకున్నప్పుడు నిరసించింది మేమే.. నిరసన తెలిపింది మేమే. పదేళ్లలో ఐదేళ్లు కేంద్రంలో ఎంపీగా ఉన్నారు. ఒక్కరోజు గొంతు విప్పారా? తెలంగాణ రాష్ట్రం రావాల్సిన హక్కుల గురించి పార్లమెంట్‌లో ప్రసంగించారా? అంటూ నిలదీశారు. కేటీఆర్‌ ప్రసంగానికి స్పీకర్‌ మాట్లాడుతూ.. తీర్మానంపై మాట్లాడాలని సూచించగా.. తీర్మానం ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. నోటిమాటలతో తీర్మానాలు కావాన్నారు. చర్చపై మాట్లాడుతున్నాం. విూరు రాసిస్తే అదే చదువుతా. చర్చలో పాల్గొని మాట్లాడున్నాం. హైకోర్టు విభజన కూడా పోరాటాలతోనే సాధించాం. కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్‌ తేల్చాలని.. రెఫర్‌ చేయాలంటే పదేళ్ల వెంటపడితే.. చివరకు కేసీఆర్‌ గట్టిగా నిలదీస్తే మొన్న ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేశారు. మేం సాధించిన అతిపెద్ద విజయం. అందుకే శాసించి సాధించుకోవాలి తప్పా.. యాచిస్తే కేంద్రం లొంగదు’ అన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి