
చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ విడుదల చేసింది. తాజాగా నీటి గలగలలతో.. చుట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాంతం కనువిందుగా మారింది. కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా ఈ జలాశయాన్ని నిర్వహిస్తున్నారు. మైసూరు రాజు నాల్వడి కృష్ణ రాజ ఒడెయరు తన తల్లి కెంప నంజమ్మణి వాణి విలాస పేరిట వేదావతి నదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మించారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. చిత్రదుర్గతో పాటు తుమకూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఈ జలాశయం నుంచి నీరు అందిస్తున్నారు. ఈ జలాశయంలో 30 టీఎంసీల నీటిని నిలువ ఉంచవచ్చు. వర్షపాతం తక్కువగా ఉండడంతో ఇటీవలి ఏడాదుల్లో జలాశయంలో 22 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. రానున్న రోజుల్లో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి