
అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు
రూ.1లక్షా 29 వేల కోట్ల విద్యుత్ బకాయలు
విద్యుత్ రంగంపై సిఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
అమరావతి,జూలై9(ఇది నిజం): భావితరాల భవిష్యత్‌ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. గత ప్రభుత్వం ఎంత నష్టం
చేసిందో ప్రజలకు చెబుతున్నాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడిరది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయి. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014`19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018`19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కోకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారు‘ అని చంద్రబాబు వివరించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై కూటమి ప్రభుత్వం.. శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నది. తాజాగా విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడిరచారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. 2004లో తన పవర్ పోయింది కానీ పవర్ సెక్టార్‌లో తీసుకువచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిరదని అన్నారు. ªూష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు.