
ఢిల్లీ న్యూస్: భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో IPL 2025 ఈవెంట్‌ను BCCI వాయిదా వేసింది. ప్రస్తుతం IPL సీజన్ 18 నిలిపివేయబడినందున ఇకపై మ్యాచ్‌లు జరగవు. కేంద్రం, అన్ని ఫ్రాంచైజీలు, ఇతర వాటాదారులను సంప్రదించిన తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఎటువంటి మ్యాచ్ జరగదు.
ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ప్రథమమన్న తత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నామని BCCI అధ్యక్షుడు తెలిపారు. ఇప్పటి వరకు అభిమానులు ఎదురుచూస్తున్న అన్ని మ్యాచ్‌లు ఒక్కసారిగా నిలిచిపోవడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో పెరిగిన ఉద్రిక్త వాతావరణం క్రీడారంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. ధర్మశాలలో జరిగిన చివరి మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయడం, అప్పటి నుంచి కొనసాగుతున్న భద్రతా చర్చలు ఈ నిర్ణయానికి దారి తీశాయి. విదేశీ ఆటగాళ్లు, వారి బోర్డులు వ్యక్తం చేసిన భద్రతా ఆందోళనలు కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.
ఆర్థికంగా ఐపీఎల్‌కు తీరని దెబ్బే అయినా, దేశ భద్రతపై రాజీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్ట చేశారు.
IPL 2025లో ఇంకా ఏ జట్లకు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి
59: LSG vs RCB
60: SRH vs KKR
61: MI vs PBKS
62: DC vs GT
63: CSK vs RR
64: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్
65: GT vs LSG
66: ఢిల్లీ క్యాపిటల్స్ vs DC
67: RR vs PBKS
68: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్
69: GT vs CSK
70: LSG vs SRH
……….