ఉమర్ ఆలీషా పై పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

విల్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీషా సాహిత్యం : బహుముఖీనత పై అంతర్జాతీయ సదస్సు 2024 డిసెంబరు 9, 10 తేదీలలో మెరీనా ఆవరణం, రజితోత్సవ ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి పరిశోధనా వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సమర్పించబడిన పరిశోధన వ్యాసాలను యు.జి.సి. కేర్ జర్నల్ ‘మూసి’ పత్రికలో ప్రచురించి సదస్సు ప్రారంభ సమావేశంలో ఆవిష్కరించాలని నిర్ణయించడమైంది.

పరిశోధన వ్యాస రచయితలకు తగిన సూచనలు
1. ఉమర్ ఆలీషా జీవితం, సాహిత్యం విశేషాలు తెలిపే విధంగా వ్యాసం ఉండాలి.
2. వ్యాస శీర్షికలు మరియు అందులోని విషయాలు, ఉమర్ ఆలీషాగారి సాహిత్యానికి సంబంధించినవై ఉండాలి.
3. మీ పరిశోధన వ్యాసాలలో అక్షరదోషాలు ఉన్నా, నాలుగు పుటలకు తక్కువ ఉన్నా పునరావృత వాక్యాలున్నా ప్రచురణకు అంగీకరించబడవు. వ్యాస రచనకు ఆధారంగా నిలిచిన ఆధార గ్రంథాలు తెలపాలి. తుది నిర్ణయం నిర్వాహకులదే.
4. వ్యాస రచనలలో పేర్కొన్న అంశాలకు వారిదే బాధ్యత అని అంగీకార పత్రాన్ని వ్యాసంతో పాటు జతపరచాలి. 5. మీ విలువైన పత్రాలను నవంబర్ 22, 2024లోపు 4 పేజీలు తగ్గకుండా 7 పేజీలు మించకుండా A4 సైజులో
అను 7 ప్రియాంక ఫాంటు 18 లైన్, స్పేసు 21తో, పేజ్ మేకర్ లో Open file & PDF file ఈ కింది మెయిల్ umaralisha2024@gmail.com కి పంపవలసిందిగా కోరుతున్నారు.
6. పరిశోధన వ్యాసం ఎంపిక అయిన తర్వాతనే తగిన రుసుము చెల్లించాలి. వ్యాస ప్రచురణ నిమిత్తం రూ. 700/ (GPay/Phone Pay 9701869674) 2. పాల్గొన్న వారికి మాత్రమే ప్రశంసా పత్రం మరియు సదస్సు ప్రత్యేక సంచిక అందించబడుతుంది.
7. ఆర్థిక వనరుల దృష్ట్యా పత్ర సమర్పకులు తమ సదుపాయాలు స్వయంగా తామే ఏర్పాటు చేసుకోవాలి.
8. ఈ జాతీయ సదస్సుకు సంబంధించిన విషయాలు ప్రత్యేక వాట్సప్ గ్రూపులో తెలియజేయబడుతుంది.
9. వ్యాస రచయితలు పరిశోధన పద్ధతులను పాటించాలి. ఆసక్తి కలిగినవారు సంచాలకులను సంప్రదించగలరు.

ప్రధాన సంచాలకులు
ఆచార్య విస్తాలి శంకరరావు, తెలుగుశాఖాధ్యక్షులు,
మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై. (9445203041)
సదస్సు సంచాలకులు
డా. పాండురంగం కాళియప్ప (9701869674)
డా. మాదా శంకరబాబు (7200685477)
…………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి