విల్లివాకం న్యూస్: రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలంతా ఐక్యమత్యంతో కొనసాగితే మన సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. చెన్నై కీల్ పాక్ లోని ఏఐటిఎఫ్ కార్యాలయంలో’ మాతృభాష సంరక్షణ దినం పేరిట డాక్టర్ సీఎంకే రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సీఎంకే రెడ్డి కేకును కట్ చేసి పేదలకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నామని కానీ అందుకు తగ్గ మన హక్కులను సాధించుకోవడంలో మనం విఫలమవుతుండడం ఎంతో బాధాకరమన్నారు, కారణం మనలో ఐక్యమత్యం లేకపోవడం, అందుకే కుల,మత, ప్రాంతీయ భేదాలను మరచి తమిళనాడు రాష్ట్రంలో ఉంటున్న తెలుగు ప్రజలంతా ఐక్యమత్యంతో ముందుకు కొనసాగాలని ప్రతి కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యమత్యాన్ని పాలకులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు భాష చదువుకునేందుకు సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా మనకు అవకాశం ఇచ్చింది, కానీ మనం మన భాషను కాపాడుకునేందుకు నేటితరం విద్యార్థులకు తెలుగు భాషను నేర్పించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తెలుగు సంఘాల నిర్వాహకులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. అనంతరం జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ సీఎంకే రెడ్డిని చెన్నై మహా నగరంలోని తెలుగు ప్రముఖులు గజమాలతో, శాలువలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఐటిఎఫ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సీఎం కిషోర్, ప్రధాన కార్యదర్శి నందగోపాల్, టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయకుమార్, సినీ గేయ రచయిత భువనచంద్ర, తాళ్లూరి సురేష్, విజి జయకుమార్, జనార్ధనం, పద్మనాభన్, ఏఐటిఎఫ్ సాంస్కృతిక కార్యదర్శి చెల్లి సెల్వం, ప్రేమాలయ ఐజయ్య, యు దేవదానం, బాలాజీ, సి హెచ్ తిరుమల రావు, జయపాల్, జేమ్స్, వంజరపు శివయ్య, పాల్ కొండయ్య, దీన దయాల్, తదితరులు శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
పుళల్ కావంగరై తెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సీఎం కే రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చారు. సంఘ గౌరవాధ్యక్షులు లయన్ జి మురళి, సంఘ అధ్యక్షులు డి రామకృష్ణ, సంఘ కార్యదర్శి నరసింహారావు, ఉపాధ్యక్షులు చిట్టిబాబు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
అఖిలభారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీ.ఎం కే.రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ట్రిప్లికేన్ టామ్స్ శాఖ నిర్వాహకులు పాల్ కొండయ్య, దీన దయాల్, డాక్టర్ సీఎం కే రెడ్డిని శాలువతో సత్కరించి స్వామి వివేకానంద పుస్తకాన్ని బహుకరించారు. టి నగర్ న్యూస్
One Response
Nice