
విల్లివాకం న్యూస్: రాంనగర్ లో 47వ హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రతిరోజు మండల పూజ జరుగుతున్నది. దీనికి రాంనగర్ మెయిన్ రోడ్డులో గల శ్రీ కోదండరామ భక్త భజన మందిరము దగ్గరనున్న శ్రీ రామ దాసాంజనేయ ఆలయంలో జరుగుతున్నాయి. ట్రిప్లికేను లోని రామ్ నగర్ లో శ్రీ రామదాస ఆంజనేయ స్వామి ఆలయ 47వ వార్షిక మహోత్సవ జరుగుతున్నది. ముఖ్యమైన కార్యక్రమాలు 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్నాయి. హనుమాన్ జయంతి నుండి మండల పూజలు జరుగుతున్నాయి. 8.1.2026 తేదీ గురువారం రాత్రి పత్తిపాటి రాజేష్, ప్రేమ దంపతులు మండల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి పూలమాలతో ఆహ్వానించి ఆశీర్వదించారు. తర్వాత ప్రసాదాలు అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కార్య నిర్వాహకులు మరియు కొరుక్కుపేట గ్రామపంచాయతీ అధ్యక్షుడు చేజర్ల ప్రేమ కుమార్ మరియు పాల్ కొండయ్య హాజరయ్యారు.