ఘనంగా ‘వివేక శైవ చైతన్య అవార్డు’ ప్రదాన కార్యక్రమం

విల్లివాకం న్యూస్: జీవ సేవయే శివసేవై సేవా సంఘం ఆధ్వర్యంలో ‘వివేక శైవ చైతన్య అవార్డు’ అందజేత కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ‘సముద్రత్తిల్ ఒరు సంగమం’ పేరిట ఏర్పాటయిన ఈ కార్యక్రమానికి చెన్నై కామరాజర్ రోడ్ లో గల వివేకానందర్ ఇల్లంలోని సిస్టర్ నివేదిత హాలు వేదికయింది. ఈ కార్యక్రమంలోసద్గురునాథర్, కైలాయ సెయింట్,
శివ దామోదరన్ అయ్య,శ్రీరామకృష్ణ మఠం, సెయింట్ స్వామి సుప్రజ్ఞానానంద మహారాజ్ వేదికను అలంకరించారు.ప్రత్యేక అతిథులుగా వాదవూరడిగలార్ అయ్య,రైతు సంఘం – రాష్ట్ర అధ్యక్షుడు
ప్రముఖ సంఘసేవకుడు, జి.కె. నాగరాజ్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో శైవంలో సేవ చేసిన వారికి గుర్తింపుగా గ్రూప్ లో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేశారు. అలాగే మిగతా సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. శివ దామోదరన్ అయ్య మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాల కంటే శైవమతం ఉన్నత స్థాయిలో ఉందని, ఇందులో పలువురి కృషి ప్రశంసనీయమని అన్నారు.

జి.కె నాగరాజ్ మాట్లాడుతూ శైవ సిద్ధాంతాలను అందరూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, శైవ మతాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. చివరిగా జీవ సేవయే శివసేవై సేవా సంఘం అధ్యక్షుడు పి. లోకేష్ వందన సమర్పణ చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలతో సహా అనేకమంది భక్తులు పాల్గొన్నారు.

…………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250501-WA0134
ఘనంగా 'వివేక శైవ చైతన్య అవార్డు' ప్రదాన కార్యక్రమం
IMG_20250430_203229
ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పూజలు
n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి