విల్లివాకం న్యూస్: జీవ సేవయే శివసేవై సేవా సంఘం ఆధ్వర్యంలో 'వివేక శైవ చైతన్య అవార్డు' అందజేత కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. 'సముద్రత్తిల్ ఒరు సంగమం' పేరిట ఏర్పాటయిన ఈ కార్యక్రమానికి చెన్నై కామరాజర్ రోడ్ లో గల వివేకానందర్ ఇల్లంలోని సిస్టర్ నివేదిత హాలు వేదికయింది. ఈ కార్యక్రమంలోసద్గురునాథర్, కైలాయ సెయింట్,
శివ దామోదరన్ అయ్య,శ్రీరామకృష్ణ మఠం, సెయింట్ స్వామి సుప్రజ్ఞానానంద మహారాజ్ వేదికను అలంకరించారు.ప్రత్యేక అతిథులుగా వాదవూరడిగలార్ అయ్య,రైతు సంఘం - రాష్ట్ర అధ్యక్షుడు
ప్రముఖ సంఘసేవకుడు, జి.కె. నాగరాజ్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో శైవంలో సేవ చేసిన వారికి గుర్తింపుగా గ్రూప్ లో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేశారు. అలాగే మిగతా సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. శివ దామోదరన్ అయ్య మాట్లాడుతూ దేశంలోని అన్ని మతాల కంటే శైవమతం ఉన్నత స్థాయిలో ఉందని, ఇందులో పలువురి కృషి ప్రశంసనీయమని అన్నారు.
జి.కె నాగరాజ్ మాట్లాడుతూ శైవ సిద్ధాంతాలను అందరూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, శైవ మతాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. చివరిగా జీవ సేవయే శివసేవై సేవా సంఘం అధ్యక్షుడు పి. లోకేష్ వందన సమర్పణ చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలతో సహా అనేకమంది భక్తులు పాల్గొన్నారు.
................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com