ఘనంగా వెంకటేశ పెరుమాళ్ ఊరేగింపు

టీ నగర్ న్యూస్: తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గొడుగుల ఉత్సవం, వెంకటేశ పెరుమాళ్ ఊరేగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో శనివారం రాత్రి భక్తులు నిర్వహించారు. చెన్నై తండయారుపేట నెహ్రూ నగర్ లో ఉన్న శ్రీ రామాలయంలో ప్రతి ఏడాది పురటాసి మాసంలో వెంకటేశ పెరుమాళ్ గొడుగుల ఉత్సవం ఎంతో ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడ తెలుగు ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పురటాసి మాసంలోని ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడే తెలుగు ప్రజలు మొదటి వారం 13వ వీధికి చెందిన డి సాంబయ్య కుటుంబ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను ఏర్పాటు చేశారు. రెండవ వారం 13వ వీధికి చెందిన బి శ్రీనివాసరాజు కుటుంబం, 9వ వీధికి చెందిన సరాబంది రాజు కుటుంబం, ఎనిమిదవ వీధికి చెందిన కే నాగరాజు కుటుంబం తరఫున పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. అలాగే మూడవ వారం 9వ వీధికి చెందిన పి ఆదినారాయణ రావు కుటుంబం, రామకృష్ణ కుటుంబం, రామచంద్రన్ కుటుంబం తరపున ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే చివరి వారం 9వ వీధికి చెందిన ఐవీ బాలాజీ కుటుంబం, ఎం హేమావతి కుటుంబం తరపున ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు. శనివారం రాత్రి స్వామి వారిని పల్లకిలో ఉంచి భక్తి గీతాలు ఆలపిస్తూ ఆలయం చెట్టు ఊరేగింపు నిర్వహించారు.

అలాగే స్వామివారి మహిమను తెలుపుతూ భక్త బృందం గీతాలను ఆలపించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఐ వి బాలాజీ, సెక్రెటరీ జి బాబు, కోశాధికారి పి ప్రకాష్ బాబు, ఉపాధ్యక్షులు ఏ సురేష్, దాసం బాలాజీ, సహాయ కార్యదర్శి ఆర్ నాగరాజు, ఆర్ బాజీ బాబు, సహాయ కోశాధికారు పి ఉదయకుమార్, ఎస్ శశి కుమార్ పర్యవేక్షించారు. గోవింద నామస్మరణ తో ఆలయ ప్రాంగణం మారు మోగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
…………………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం