
విళ్లివాకం న్యూస్: తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అడ్డుకుంటున్నారని గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆరోపించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఆచారానికి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ‘స్పష్టంగా ఉల్లంఘించారని’ గవర్నర్ ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిరోధించడానికి తన సర్వశక్తులను ఒడ్డుతోంది’ అని ఆయన పేర్కొంటూ, 75 ఏళ్ల దేశ చరిత్రలో న్యాయవ్యవస్థను ఈ విధంగా ధిక్కరించడం అపూర్వమని అన్నారు. ఈ విషయంపై తీర్పు ఇచ్చినందుకు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, న్యాయమూర్తిని బెదిరించారని కూడా గవర్నర్ రవి ఆరోపించారు.