
పెద్దకడబురు, జూలై 09 : కుటమీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రాష్ట్రంలోని కార్మికులు కళ్ళలో ఆనందం వెలు విరుస్తుంది. ఉచిత ఇసుక విధానం వలన రాష్ట్రంలో కుంటుపడిన నిర్మాణరంగం పూర్తిగా కోలుకుంటుందని అన్నరు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. గతంలో గత ప్రభుత్వం ఇసుకను అధిక ధరలకు అమ్మడం వలన ఎంతోమంది భవననిర్మాణ కార్మికులు, ఇసుక రవాణా కార్మికులు, నిర్మాణరంగంపై ఆధారపడి, ఉపాధి లేక రోడ్డున పడ్డ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో, ధవళేశ్వరం బ్యారేజ్ పైన లాంగ్ మార్చ్ నిర్వహించి అండగా నిలబడ్డట్టు గుర్తు చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన ఇసుక టెండర్ల వల్ల వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రమే కోట్ల కోట్ల అక్రమంగా సంపాదించారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉచిత ఇసుక విధానం వలన ఎంతోమంది బాగుపడడమే గాక, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. దీనికి ప్రజలంతా ఎంతో సంతోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఒక్కొక్కటి, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఇసుకరీచులు లేని కారణంతో స్టాక్ యార్డులను ఉంచి, అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు.కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు.