వచ్చే మూడేళ్లలో పాఠశాలల మరింత బలోపేతం

ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లపై నిర్వహించిన సవిూక్షలో ఆయన మాట్లాడారు. సెవిూ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ ప్లేస్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీ ల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు. నాలుగో తరగతి నుంచి సెవిూ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సెవిూ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలి. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలి. ప్రభుత్వ, సీఎస్‌ఆర్‌ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం