న్యూఢిల్లీ ప్రతినిధి:భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు శనివారం ఉదయం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, మరియు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
అంత్యక్రియల వివరాలు:
ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఉంచుతారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ సమయంలో చివరిసారిగా మన్మోహన్ గారికి నివాళులర్పించేందుకు వీలవుతుంది.
ఆ తర్వాత 9:30 గంటలకు ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర జరుగుతుంది. అంత్యక్రియలు పూర్తిగా అధికారిక లాంఛనాలతో నిర్వహించబడతాయి.
ప్రముఖుల హాజరు షెడ్యూల్:
మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, సైనికాధికారులు, మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. వారి షెడ్యూల్ ప్రకారం:
ఉ.11:15: హోం సెక్రటరీ
ఉ.11:17: డిఫెన్సీ సెక్రటరీ
ఉ.11:19: ఎయిర్ స్టాప్ చీఫ్
ఉ.11:21: నేవల్ స్టాప్ చీఫ్
ఉ.11:23: ఆర్మీ స్టాప్ చీఫ్
ఉ.11:25: డిఫెన్సీ స్టాప్ చీఫ్
ఉ.11:27: కేబినెట్ సెక్రటరీ
ఉ.11:29: రక్షణ రాజ్య మంత్రి
ఉ.11:31: రక్షణ మంత్రి
ఉ.11:33: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఉ.11:36: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఉ.11:39: ఉపరాష్ట్రపతి
ఉ.11:42: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
కార్యక్రమం తుది ఘట్టంగా, ఉదయం 11:45 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు జరుగుతాయని హోంశాఖ పేర్కొంది.
అధికారిక ఘనతతో చివరి వీడ్కోలు:
మన్మోహన్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రముఖులు, ప్రజలు అంతిమ నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశం ఓ మహానేతను శ్రద్ధాంజలిగా వీడ్కోలు ఇవ్వనుంది.