బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ఒక్క కేటాయింపు కూడా లేకపోవడం దారుణం

ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా

స్వీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్ష అన్న కెటిఆర్‌

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈసారికూడా ఏమైనా భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని కేటీఆర్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ.. బడ్జెట్‌ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్‌ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్టాల్రకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణకు మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విజన చట్టంలో దాదాపు 35 హావిూల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు అని కేటీఆర్‌ తెలిపారు. ఐఐఎం సహా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ముంబై` నాగపూర్‌, బెంగళూరు` చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు. మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢల్లీిలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు. తెలంగాణకు మరోసారి ఈ కేంద్ర బడ్జెట్‌ దక్కింది గుండు సున్నా. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బడ్జెట్‌ తెలియ జేస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆంధప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. ఏపీ ఇండస్టియ్రల్‌ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు.. సంతోషమే. కానీ ఆంధప్రదేశ్‌, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్టాల్రను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం పేరు చెప్పిన విూరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు అని కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం