ప్రభుత్వం మారినా… కాకినాడ కార్పోరేషన్‌ తీరు మారలేదు!!

కాకినాడ, జూలై 08 : రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు మారినా స్థానిక ప్రభుత్వం కాకినాడ నగర పాలక సంస్థలో మాత్రం అధికారులు సిబ్బంది ఎవ్వరూ మారలేదని వారి తీరులోనూ మార్పులేదని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పాలక వర్గం కౌన్సిల్‌ లేకపోవడంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. రెవిన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, హెల్త్‌, పరిపాలన విభాగాల్లో ఏళ్ల తరబడి కొలువు దీరిన అధికారులు గత అయిదేళ్ల నుండి కార్పోరేషన్‌ ఆస్తులను నాశనం చేయడం, అవినీతి ఆస్తులు కూడబెట్టడం, అక్రమ నిర్మాణాలను ఇష్టారాజ్యం చేయడం వంటివి సాగించినా ఎటువంటి చర్యలు లేవన్నారు. స్మార్ట్‌ సిటీ కంపెనీ ఏర్పడిన తరువాత గత 2016 నుండి ఎసిబి, విజిలెన్స్‌ దర్యాప్తులు జరగలేదన్నారు. ఎనిమిది ఏళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నవారున్నారన్నారు. కమీషన్ల రూపంలో భారీ కవర్ల బట్వాడా జరుగుతున్న కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. నగరంలో కొన్ని వందల అక్రమ కట్టడాలు వున్నప్పటికీ వాటి జోలికి పోవడంలేదన్నారు. అక్రమ కట్టడాల నిర్మాణానికి కారణమైన అధికారులను బాధ్యులను చేసి సస్పెండ్‌ చేయకపోవడం దుర దృష్టకరమన్నారు. కాకినాడ కార్పోరేషన్‌ ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి విచారణ లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఉష్‌ గప్‌ చుప్‌ అన్నట్టుగా స్థానిక పాలన పత్రికా ప్రకటనలకు పరిమితమై నడుస్తోందన్నారు. వీధి దీపాల నిర్వహణ అర్ధాంధకారంలో వుందని త్రాగు నీరు లేత ఆకుపచ్చ రంగులోనే సరఫరా అవుతున్నదని, శానిటేషన్‌ నిర్వహణ అరకొరగా నడుస్తున్నదని దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు లేవని, గ్రీనరీ పెంపుదలకు మొక్కలు నాటించే కార్యాచరణ కరువయ్యిందన్నారు. కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులతో మరికొంత మంది ప్రయివేటు సిబ్బందిని పెట్టుకుని చేస్తున్న దోపిడీ దారుణంగా వుందన్నారు. కార్పోరేషన్‌ పాఠశాలల్లో పలు చోట్ల తగిన టాయిలెట్స్‌ బాత్‌రూమ్‌లు లేవన్నారు. పాఠశాలల ఆవరణలు వర్షాలకు మునిగిపోతున్న అవస్థ వుందన్నారు. వీధికుక్కల సంఖ్య చాలా అధికంగా పెరిగిందన్నారు. పాలనా విధానం మారకపోవడం వలన, అజమాయిషీ కరువవ్వడం వలన నగర ప్రగతి పౌర సౌకర్యాలు అంట కత్తెర చందంగా వుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను వసూలు చేయడం లేదన్నారు. ముంపు నివారణకు యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టడంలేదన్నారు. జిల్లా కేంద్రం స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో వున్నప్పటికీ గతం నుండి ఇప్పటి వరకు 23నెలలుగా సమీక్ష జరగలేదన్నారు. సిటీ ఎమ్మెల్యే, రూరల్‌ ఎమ్మెల్యే కార్పోరేషన్‌ ఆర్థిక పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించకపోవడం వలన గతం వలె షరా మామూలుగానే కొనసాగుతున్నదన్నారు. 2024-25 కార్పోరేషన్‌ బడ్జెట్‌ ప్రజలకు తెలపకుండా గోప్యంగా జరుగుతున్న తీరులోనే స్థానిక పాలన దురవస్థ వెల్లడి అవుతున్నదన్నారు. సమూలంగా క్రింది స్థాయి నుండి మున్సిపల్‌ ఉద్యోగులు అధికారుల బదిలీలు జరగకపోతే నగరం ఏ మాత్రం బాగుపడే అవకాశం వుండదన్నారు. గతంలో కమీషనర్‌గా పనిచేసిన స్వప్నిల్‌ దినకర్‌ హయాంలో కాకినాడ కార్పోరేషన్‌ ఆస్తులు ఆదాయాలు కొల్లగొట్ట బడ్డాయన్నారు. తీవ్ర ఆర్థిక మాంద్యం ఆయన హయాంలోనే ఎక్కువగా జరిగిందన్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం కలెక్టర్‌గా ప్రమోషన్‌ పొందారని కాకినాడ మాత్రం వేల కోట్ల అప్పుల్లో వుందన్నారు. ఆయనకు ముందు ఆయన తరువాత కార్పోరేషన్‌లో పనిచేసిన అధికారులు ఉద్యోగులు బాగా ఆర్థిక ప్రయోజనాలు పొంది ఇక్కడే తిష్ట వేసుకుని ప్రజాప్రతినిధుల ప్రాపకంతో యధావిధిగా కొనసాగుతున్న తీరు దురదృష్టకరమన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులు దోచుకోవడానికి కాకుండా ప్రగతి కోసం పాటుపడే నిర్వహణ రావాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ కక్షతో చేస్తున్న యాగీ తప్ప ప్రజాప్రయోజనాలు నెరవేర్చేతీరుగా కార్పోరేషన్‌ యంత్రాంగం మార్పుకాలేదన్నారు. తెదేపా, జనసేన, బిజెపి కూటమి అధినేతలు ఇందుకు దృష్టి సారించే విధంగా కూటమి శ్రేణులు నగర ప్రగతి కోసం పబ్లిక్‌ డిమాండ్‌ తెలియజేయాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ అధ్యక్షతన సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ ఉమ్మడిగా ప్రత్యేక సమీక్ష నిర్వహించాలన్నారు. అఖిలపక్షం సూచనలు సలహాలు స్వీకరించాలని కోరారు.  : రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు మారినా స్థానిక ప్రభుత్వం కాకినాడ నగర పాలక సంస్థలో మాత్రం అధికారులు సిబ్బంది ఎవ్వరూ మారలేదని వారి తీరులోనూ మార్పులేదని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పాలక వర్గం కౌన్సిల్‌ లేకపోవడంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. రెవిన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, హెల్త్‌, పరిపాలన విభాగాల్లో ఏళ్ల తరబడి కొలువు దీరిన అధికారులు గత అయిదేళ్ల నుండి కార్పోరేషన్‌ ఆస్తులను నాశనం చేయడం, అవినీతి ఆస్తులు కూడబెట్టడం, అక్రమ నిర్మాణాలను ఇష్టారాజ్యం చేయడం వంటివి సాగించినా ఎటువంటి చర్యలు లేవన్నారు. స్మార్ట్‌ సిటీ కంపెనీ ఏర్పడిన తరువాత గత 2016 నుండి ఎసిబి, విజిలెన్స్‌ దర్యాప్తులు జరగలేదన్నారు. ఎనిమిది ఏళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకున్నవారున్నారన్నారు. కమీషన్ల రూపంలో భారీ కవర్ల బట్వాడా జరుగుతున్న కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. నగరంలో కొన్ని వందల అక్రమ కట్టడాలు వున్నప్పటికీ వాటి జోలికి పోవడంలేదన్నారు. అక్రమ కట్టడాల నిర్మాణానికి కారణమైన అధికారులను బాధ్యులను చేసి సస్పెండ్‌ చేయకపోవడం దుర దృష్టకరమన్నారు. కాకినాడ కార్పోరేషన్‌ ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి విచారణ లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఉష్‌ గప్‌ చుప్‌ అన్నట్టుగా స్థానిక పాలన పత్రికా ప్రకటనలకు పరిమితమై నడుస్తోందన్నారు. వీధి దీపాల నిర్వహణ అర్ధాంధకారంలో వుందని త్రాగు నీరు లేత ఆకుపచ్చ రంగులోనే సరఫరా అవుతున్నదని, శానిటేషన్‌ నిర్వహణ అరకొరగా నడుస్తున్నదని దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు లేవని, గ్రీనరీ పెంపుదలకు మొక్కలు నాటించే కార్యాచరణ కరువయ్యిందన్నారు. కొందరు రిటైర్డ్‌ ఉద్యోగులతో మరికొంత మంది ప్రయివేటు సిబ్బందిని పెట్టుకుని చేస్తున్న దోపిడీ దారుణంగా వుందన్నారు. కార్పోరేషన్‌ పాఠశాలల్లో పలు చోట్ల తగిన టాయిలెట్స్‌ బాత్‌రూమ్‌లు లేవన్నారు. పాఠశాలల ఆవరణలు వర్షాలకు మునిగిపోతున్న అవస్థ వుందన్నారు. వీధికుక్కల సంఖ్య చాలా అధికంగా పెరిగిందన్నారు. పాలనా విధానం మారకపోవడం వలన, అజమాయిషీ కరువవ్వడం వలన నగర ప్రగతి పౌర సౌకర్యాలు అంట కత్తెర చందంగా వుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్ను వసూలు చేయడం లేదన్నారు. ముంపు నివారణకు యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టడంలేదన్నారు. జిల్లా కేంద్రం స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనలో వున్నప్పటికీ గతం నుండి ఇప్పటి వరకు 23నెలలుగా సమీక్ష జరగలేదన్నారు. సిటీ ఎమ్మెల్యే, రూరల్‌ ఎమ్మెల్యే కార్పోరేషన్‌ ఆర్థిక పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించకపోవడం వలన గతం వలె షరా మామూలుగానే కొనసాగుతున్నదన్నారు. 2024-25 కార్పోరేషన్‌ బడ్జెట్‌ ప్రజలకు తెలపకుండా గోప్యంగా జరుగుతున్న తీరులోనే స్థానిక పాలన దురవస్థ వెల్లడి అవుతున్నదన్నారు. సమూలంగా క్రింది స్థాయి నుండి మున్సిపల్‌ ఉద్యోగులు అధికారుల బదిలీలు జరగకపోతే నగరం ఏ మాత్రం బాగుపడే అవకాశం వుండదన్నారు. గతంలో కమీషనర్‌గా పనిచేసిన స్వప్నిల్‌ దినకర్‌ హయాంలో కాకినాడ కార్పోరేషన్‌ ఆస్తులు ఆదాయాలు కొల్లగొట్ట బడ్డాయన్నారు. తీవ్ర ఆర్థిక మాంద్యం ఆయన హయాంలోనే ఎక్కువగా జరిగిందన్నారు. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం కలెక్టర్‌గా ప్రమోషన్‌ పొందారని కాకినాడ మాత్రం వేల కోట్ల అప్పుల్లో వుందన్నారు. ఆయనకు ముందు ఆయన తరువాత కార్పోరేషన్‌లో పనిచేసిన అధికారులు ఉద్యోగులు బాగా ఆర్థిక ప్రయోజనాలు పొంది ఇక్కడే తిష్ట వేసుకుని ప్రజాప్రతినిధుల ప్రాపకంతో యధావిధిగా కొనసాగుతున్న తీరు దురదృష్టకరమన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులు దోచుకోవడానికి కాకుండా ప్రగతి కోసం పాటుపడే నిర్వహణ రావాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ కక్షతో చేస్తున్న యాగీ తప్ప ప్రజాప్రయోజనాలు నెరవేర్చేతీరుగా కార్పోరేషన్‌ యంత్రాంగం మార్పుకాలేదన్నారు. తెదేపా, జనసేన, బిజెపి కూటమి అధినేతలు ఇందుకు దృష్టి సారించే విధంగా కూటమి శ్రేణులు నగర ప్రగతి కోసం పబ్లిక్‌ డిమాండ్‌ తెలియజేయాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ అధ్యక్షతన సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ ఉమ్మడిగా ప్రత్యేక సమీక్ష నిర్వహించాలన్నారు. అఖిలపక్షం సూచనలు సలహాలు స్వీకరించాలని కోరారు. 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం
IMG-20260630-WA0019
తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ
IMG_20260626_215013
భారత్‌కు ఐర్లాండ్ షాక్.. చారిత్రాత్మక విజయంతో సిరీస్‌లో సంచలనం
InShot_20260626_073317547
పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి
IMG_20260626_064342
హోర్ముజ్ జలసంధి రాకపోకలకు తాత్కాలిక విరామం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి