
విల్లివాకం న్యూస్: తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై చెన్నైలో గత 50 ఏళ్లుగా అవిశ్రాంతంగా సేవ చేస్తున్న తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం వ్యవస్థాపకులు ఎళ్ళూరి రమణయ్య 31 వ వర్ధంతి శుక్రవారం (26.12.2025) కీల్పాకు నందలి వృద్ధాశ్రమంలోని వృద్దులకు సహాయకాలు పంచబడ్డాయి.
సాయంకాలము పెరంబూర్ నందలి భక్తజన సమాజంలో భక్తి గీతాలు కార్యక్రమము జరిగినది.
******
నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎప్పటి వలె తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం శనివారం (27.12.2025)న తెలుగు నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ తెలుగువారికి అందజేసే ప్రయత్నం ప్రారంభించింది. ఇందులో సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి పిఆర్ కేశవులు, కోశాధికారి కె.వెంకటరాజు మరియు జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు భాషాభిమానులు కె.హరినాథ్, రచయిత్రి కె.రమాదేవి, టి. విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.