
తండ్రి బిషప్ ను కోల్పోయిన ఈ సీఐ కుటుంబం
26న అంత్యక్రియలు ఏర్పాటు
టీ నగర్ న్యూస్: ఈ సీఐ (ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా) ద్వారా దేశవ్యాప్తంగా పలు సంఘాలను స్థాపించి విస్తృతంగా సేవలు అందించిన ఈసీఐ ఫాదర్ బిషప్ ఎజ్రా సర్ గుణం (86) అనారోగ్య కారణంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్నుమూశారు. ఈయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈసీఐ చర్చిలను స్థాపించి క్రైస్తవ మత వ్యాప్తికి తన వంతు పాత్రను పోషించి లక్షలాదిమంది పేద ప్రజలకు చేయూతనిస్తూ ఆలు పెరగని పోరాటం చేస్తూ ఆయన తన పరుగును తుదముట్టించాడు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డు, ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉండగా ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె బిషప్ కదిరోలి మాణిక్యం చెన్నై డయాసిస్ బిషప్ గా సేవలందిస్తున్నారు, అలాగే రెండవ కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆయన మరణంతో ఈసిఐ కుటుంబం ఒక్కసారిగా శ్లోక సముద్రంలో మునిగింది.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ డేవి డ్ ఒనెషీము,ఈసీఐ సౌత్ఆంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే ఏబేలు నీలకంఠ, డయాసిస్ నిర్వాహకులు, సభ్యులు, ఏరియా చైర్మన్లు, తెలుగు మద్రాస్ పాస్టర్లు, దైవ సేవకుల ప్రత్యేక ప్రార్థన చేస్తూ వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబ సభ్యులకు, ఈ సీఐ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల యొక్క సందర్శనార్థం తండ్రి బిషప్ భౌతిక కాయాన్ని కెల్లిస్ లోని ఈ సి ఐ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. అలాగే అమెరికా నుంచి ఆయన చిన్న కుమార్తె వచ్చిన అనంతరం భూస్థాపితం కార్యక్రమం జరుగునున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
26 న అంత్యక్రియలు…
ప్రియమైన బిషప్‌లు మరియు నాయకులకు,
మా ఫాదర్ బిషప్ ఎజ్రా సర్గుణం అంత్యక్రియలు సెప్టెంబర్ 26న చెన్నైలో జరగనున్నాయి. మీరు మీ ప్రయాణ ఏర్పాట్లను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. బిషప్‌లు మరియు పాస్టర్‌లందరూ దయచేసి మీ క్లరికల్ దుస్తులను తీసుకురండి. బిషప్ డాక్టర్ జెఎ డేవిడ్ ఒనెసిము,బిషప్ కతిరోలి మాణిక్కం ఒక ప్రకటనలో కోరారు.