విల్లివాకం న్యూస్: 25 సంవత్సరాల వైద్య అనుభవం, కోవిడ్ మహమ్మారిలో ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతా భావంతో సేవ చేయడం, శ్రామిక శిబిరాల్లో నిత్యావసర సరుకుల పంపిణీలో అత్యుత్తమ పురస్కారాలను, సత్కారాలను డాక్టర్ సౌజన్య అందుకున్నారు.వర్షపు తుఫానుల్లో చిక్కుకున్న వారికి సహాయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం వారి సేవా దృక్పథానికి నిదర్శనం.
డాక్టర్ సౌజన్య దుబాయిలో అనేస్తేషియా నిపుణురాలు మరియు నొప్పి నిపుణురాలు.
అదనంగా సర్టిఫైడ్ వాస్తు కన్సల్టెంట్, లైఫ్ కోచ్, మరియు ఎన్ఎల్పీ ప్రాక్టీషనర్ కూడా.
ఆమె విజయాలు మరియు ప్రశంసలు : గల్ఫ్ న్యూస్ మరియు బీయింగ్ షి 2024 నుండి ఆరోగ్య విభాగంలో ఎక్స్టెన్స్ అవార్డ్. కోవిడ్ మహమ్మారిలో క్రిటికల్ కేర్ ఫ్రంట్ లైన్, హెచ్.హెచ్ షేక్ హమదాన్ నుండి ప్రశంసల గుర్తింపు.
2017 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ శస్త్రచికిత్సలో భాగమైన అనస్థీషియాలజిస్ట్, మరియు పోస్ట్ ఆపరేటివ్ నొప్పి నిపుణురాలిగా అత్యుత్తమ నైపుణ్యం చూపించారు.
2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తెలుగు మరియు కన్నడ మహిళల కోసం వుమెన్ ఎక్స్టెన్స్ అవార్డ్ అందుకున్నారు. 2024 యూఏఈ తుఫాన్లు మరియు వర్షాలు సమయంలో రైన్ సపోర్ట్.
యూఏఈ డాక్టర్స్ ఫేస్ బుక్ పేజీ ద్వారా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.
తెలుగు మహిళల కోసం మనేమ్ ఫేస్ బుక్ పేజీని రూపొందించారు. యూఏఈ తెలుగు వైద్యుల కోసం కార్యక్రమాలను నిర్వహించారు.
డిఎన్ఎస్ ఏఐ ఎమిరేట్
ఫేస్ బుక్ వేదికలో భారతీయ మహిళా వైద్యులందరినీ కలిపి స్వాతంత్ర్య దినోత్సవ
ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇది పిఎంఓ
ఇండియా సహా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు పొందారు. 2024 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్మిక శిబిరాలకు 500 నిత్యావసర సరుకుల సంచులను పంపిణీ చేశారు.
ఐపీఎఫ్ తెలంగాణ కోర్ బృందంతో కలిసి 2024 బతుకమ్మ ఉత్సవాలను దుబాయిలో నిర్వహించారు .
ప్రసవ సమయంలో మహిళలకు నొప్పి ఉపశమనం కల్పించడం,
క్యాన్సర్ నొప్పితో బాధపడే పిల్లల కోసం సేవలందించడం చేశారు. జీవిత కోచ్, యుక్తవయస్కులు మరియు తల్లిదండ్రుల న్యూరోలింగ్విస్టిక్ ప్రక్రియలపై దృష్టి సారించి, కుటుంబాలలో సంతోషకరమైన భవిష్యత్తును సృష్టించడంలో సహాయం చేశారు.
…………….