ఢిల్లీ ప్రతినిధి :బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే చేధించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/31), అర్ష్‌దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్యాతో కలిసి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(16 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీసారు.
భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించాడు. భారీ సిక్సర్‌తో పాటు 2 బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ దురదృష్టవశాత్తు నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న అతను టౌహిడ్ హృదయ్ స్టన్నింగ్ త్రోకు రనౌటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
అతన్ని ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఔట్ చేయగా.. సంజూ శాంసన్ క్లాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతన్ని మెహ్‌దీ హసన్ ఔట్ చేయగా.. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి హార్దిక్ పాండ్యా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో భారత్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం(అక్టోబర్ 9) ఢిల్లీ వేదికగా జరగనుంది.
One Response
Good