
కాకినాడ, జూలై 11 : కోనోకార్పస్ చెట్టు (కాంబ్రేటేసి జాతికి చెందిన) విష వృక్షం కాగా ఏడాకుల చెట్టు (ఆల్స్టోనియా స్కాలరీస్ జాతికి చెందిన) సతత హరిత వృక్షమని వీటిలో కోనో కార్పస్ ను విష వృక్షంగా ఏడాకుల చెట్టును డెవిల్ట్రీగా గుర్తించి ప్రపంచ దేశాల్లో పలు రాష్ట్రాల్లో తొలగిస్తున్నారు. వీటిలో కాకినాడ నగరం నందు 35వేల కోనో కార్పస్ చెట్లు 150 ఏడాకుల చెట్లు వున్నందున వాటిని తొలగించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర పర్యావరణ శాఖా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు గత జూన్15న లేఖ వ్రాసింది. ఇటీవల కలెక్టరేట్ సమీక్షలో కోనో కార్పస్ తొలగించాలని మంత్రి ఆదేశాలివ్వగా కార్పోరేషన్ అధికారులు కోనోకార్పస్ పేరిట ఏడాకుల చెట్లు తొ గింపుకు మాత్రమే దృష్టి సారిస్తున్నారని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ (KKD 202310163954)కు పిర్యాదు చేసిన లేఖపై వీటివలన హానిలేదని కార్పోరేషన్ అధికారులు గత ఏడాది ఆగస్టు 16న తప్పుడు సమాచారం ఇచ్చి పరిష్కరించినట్టుగా పేర్కొన్నారని ఇప్పుడు అదే రీతిగా చిత్తశుద్ధి నిర్వహణ లేకుండా చేస్తున్నారన్నారు. కోనో కార్పస్ మొక్కలను స్మార్ట్ సిటీ ప్రారంభం 2017లో కౌన్సిల్ ఎన్నికలు జరగక ముందు రు.5 కోట్ల రూపాయలు వెచ్చించి 5వేల మొక్కలు నాటగా 35 వేల మొక్కలు ఏడేళ్ల కాలంగా వృక్షాలుగా తయారయ్యి నగర వ్యాప్తంగా అన్ని వీధులు, ప్రధాన రహదారులు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్నగు చోట విరివిగా పెరిగాయన్నారు. ఈ చెట్ల మీద ఏ పక్షులు వాలవని పక్షి గుడ్లు పెట్టేందుకు గూళ్లు కూడా కట్టవని వీటి ఆకులను ఆవులు, గేదెలు, మేకలు తినవని వీటి వేర్లు భూగర్భ జలాలను మట్టి పోరల్లోకి వెళ్లనీయకుండా అడ్డగించి హరిస్తాయని వీటి పుప్పొడి గాలిలోకి కలిసి శ్వాస ద్వారా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన ఆస్మా, కంటి జబ్బులు, చర్మ వ్యాధులు, దద్దుర్లు కలిగిస్తాయని ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేసే ఈ చెట్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, జీవ వైవిద్యానికి, భూగర్భ జలాలకు అత్యంత హని చేసే చెట్లన్నారు. పదేళ్ల కాలంలో వృక్షాలుగా పెరిగే మొక్క మూడేళ్లకే పెరిగే అవకాశం వున్నందున, పశువులు తినే అవకాశం లేనందున ప్లాస్టిక్ మెస్ లు వేసి ప్రజలకు ఉపయోగం లేని గ్రీనరీని ఆనాడు పెంచారన్నారు. ఏడాకుల చెట్లు ప్రధానం గా పార్కులలో ఎక్కువగా ఉన్నాయన్నారు. శీతాకాలంలో ఏడాకుల చెట్లున్న చోట భయంకరమైన దుర్వాసన వంద మీటర్ల పరిధిలోకి వ్యాపిస్తుందని వీటి పుప్పొడి వలన అనారోగ్యం కలుగుతుందని గర్భిణీలు గర్భస్రావానికి గురయ్యే దుస్థితి వుందన్నారు. సీనియర్ సిటిజన్స్ అనారోగ్యాలకు గురవుతారన్నారు. కోనో కార్పస్ మరియు ఏడాకుల చెట్లు వలన రోగనిరోధక శక్తి తగ్గిన వారు కరోనా పేషంట్స్ తరహగా మరింత జబ్బుపడే దుస్థితి వుందన్నారు. పర్యావరణవేత్తల ఉద్యానవనశాఖ, అటవీశాఖ, వైద్యశాఖ రిపోర్టులు సేకరించి ప్రపంచ దేశాలు ప్రకటించిన హెచ్చరికలు దేశంలో పలు రాష్ట్రాలు వీటి తొలగింపుకు చేపట్టిన నిర్వహణ అనుసరించి విషపూరిత (కోనో కార్పస్), డెవిల్ ట్రీస్ ( ఏడాకుల చెట్లు) తొలగించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. తొలగించిన ప్రదేశాల్లో రాష్ట్ర వృక్ష మైన వేప మొక్కలు నాటించాలని డిమాండ్ చేశారు.