
- చదువు చారెడు … ఫీజులు బారెడు
- ప్రైవేటు విద్య …ర్యాంకులు మిద్య!
- ప్రచారం ఆకాశం… చదువులో అధ్వాహ్నం?
- తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’…..
- ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు…..
- ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి!
- తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం!
- దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు!
- ప్రైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్ ప్రసారాలు…
- ప్రైవేటుకు వచ్చేది పదుల ర్యాంకులే!
- నిబంధనలు పట్టించుకోని ప్రవేట్ విద్యాసంస్థలు…..
- అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు విలవిల…….
- చేష్టలుడిగిన విద్యాశాఖ…….
- మార్గదర్శకాలు పాటించని పాఠశాలపై చర్య శూన్యం…….
- పాఠశాలలో కానరాని ఫీజుల పట్టిక…….
- యదేచ్చగా పుస్తకాలు యూనిఫామ్ అమ్మకాలు……
- యజమాన్యాల అధిక వసులతో ప్రవేట్ పాఠశాల దోపిడి…….
- తల్లితండ్రులపై అధిక భారం…..
- ఇంతటి అరాచకంపై నోరు మెదుపుని డిఈఓ రామారావు…..
- ప్రైవేట్ యజమాన్యం కి నేనున్న అంటున్న డిఇఓ…
- పేరుకే విద్యాశాఖ అధికారి వత్తాసు మొత్తం ప్రైవేట్ కే నాట……..
- ప్రైవేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
- పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు నియమ నిబంధ నలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కనీస మార్గదర్శ కాలు పాటించకుండా జీవో 1ని తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరిట వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నిబంద నలను పాటించకుండా అనేక పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. పర్యవసానంగా విద్యాహక్కు చట్టం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. విద్యార్థుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు కార్పొరేట్ స్కూళ్లకు దాసోహం అయిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రైవేటు విద్యాలయాలు విద్యాహక్కు చట్టాన్ని కానీ, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఎమ్ ఎస్ 1 ను కానీ అనుసరించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నిలువరించే చర్యలు మాత్రం కానరావడం లేదు. కనీస నిబంధనలను పాటించకుండా నిర్ణీతవసతులు కల్పించకుండా స్థాపించిన పాఠశాలల్లో ఫీజులు మాత్రం లక్షల్లోకి చేరిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాల పేరిట, స్కూల్ యూనిఫాంల పేరిట వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఆదిశగా కనీసం కన్నెత్తికూడా చూడడం లేదు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యాలయాలపై చర్యలు చేపట్టని అధికారుల తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యాశాఖ ఉన్నాత అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. నియమనిబంధనల ప్రకారం ప్రతీ పాఠశాలలో వారి వార్షిక ఫీజులు తీసుకునే నిర్ణయం గవర్నింగ్ బాడీ పై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పాఠశాల ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని గవర్నింగ్ బాడీ ఆమోదం పొంది ఫీజ్ స్ట్రక్చర్ విద్యాశాఖ కార్యాలయంలో అప్పజెప్పి ప్రతీ పాఠశాలలో అందరికి కనిపించే లాగా నోటీసు బోర్డులో పెట్టాలి. కానీ ఈ నియమనింధకలను ఎన్ని పాఠశాలు పాటిస్తున్నాయో మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధిరులకు తెలియదంటే ఆశ్చర్యమే. ఇలా అడ్డగోలుగా వార్షిక ఫీజులు, పుస్తకాల ఫీజులంటూ ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నాత అధికారులు స్పందించి తనిఖీలు జరిపి స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్ ను అనుసరించి ఫీజులు వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావంతులు కోరుతున్నారు.