Search
Close this search box.

ఢల్లీిలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే,ప్రియాంకలతో భేటీ

రాష్ట్ర రాజకీయాలపై చర్చ

సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగరెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌ మినిస్టర్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రియాంక, ఖర్గేలతతో సమావేశం అయ్యారు. నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి నేతలు చర్చించినట్లు

తెలుస్తోంది. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటికానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతోపాటు.. రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్‌ సెషన్‌ లో ఉండబోయే కీలక అంశాలను వివరించే చాన్స్‌ ఉంది. అలాగే ఈ నెలాఖరులో వరంగల్‌ లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సభకు రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినందున.. ఢల్లీి పర్యటనలో రాహుల్‌ను కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తో రేవంత్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీసీసీ కొత్త చీఫ్‌ నియామకం, కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై చర్చించనున్నారు. ఢల్లీి పర్యటనలో పొలిటికల్‌ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నట్లు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి