Search
Close this search box.

పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు: చిరంజీవి మూలాలు, సినిమా టికెట్ రేట్లు, రాజకీయ వివక్షపై స్పందన

రాజమండ్రి న్యూస్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమండ్రిలో శనివారం జరిగిన “గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలపై స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ మూలాలను మరిచిపోనని, మెగాస్టార్ చిరంజీవి తమ అందరికీ ఆద్యులని చెప్పారు.

మూలాలను మరిచిపోనని పవన్ కల్యాణ్

పవన్ తన ప్రసంగంలో,

> “మీరు గేమ్ ఛేంజర్ అనోచ్చు, ఓజీ అనోచ్చు. కానీ ఆ మూలాలు చిరంజీవి గారి నుంచి, మొగల్తూరు అనే చిన్న గ్రామం నుంచి మొదలయ్యాయి. ఆయన వల్లే నన్ను కల్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని పిలుస్తున్నారు. ఆయనను నేను ఎప్పటికీ మర్చిపోలేను,”
అని భావోద్వేగంగా అన్నారు.

 

సినిమా టికెట్ రేట్లపై పవన్ స్పందన

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మాట్లాడుతూ,

> “సినిమా టికెట్ రేట్లు డిమాండ్, సప్లై ఆధారంగా నిర్ణయించబడతాయి. బ్లాక్‌లో టికెట్ కొంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లిపోతాయి? టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది. మా బీమ్లా నాయక్‌కి టికెట్ రేట్లు తగ్గించారు, పెంచలేదు. అయినా మేమెక్కడ వివక్ష చూపించలేదు,”
అని పేర్కొన్నారు.

 

సినిమాలు, రాజకీయాలు విడదీయాలి

సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం తగదని పవన్ చెప్పారు.

> “సినిమాను ప్రత్యేక వ్యవస్థగా చూడాలి. సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలంటే ఆ అనుభవం ఉండాలి. సినిమాలు తీయని వారు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడం అవసరం లేదు,”
అని పవన్ స్పష్టం చేశారు.

 

అభిమానుల భద్రతపై దృష్టి

పవన్ కల్యాణ్ అభిమానుల భద్రత గురించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.

> “మీకు చిన్న దెబ్బ తగిలినా నా గుండె గాయమవుతుంది. అందుకే నా ఫంక్షన్లకు టెన్షన్‌తో వస్తాను. సినిమాను సినిమాలా చూడండి, తొక్కిసలాటలు లేకుండా ఇంటికి క్షేమంగా వెళ్లాలి,”
అని పవన్ పిలుపునిచ్చారు.

 

రామ్ చరణ్‌కి అభినందనలు

“గేమ్ ఛేంజర్” సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన పవన్,

> “బాక్స్ ఆఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. బాబాయిగా కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నాను,”
అని చెప్పుకొచ్చారు.

 

తనదైన శైలిలో పవన్ వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో రాజకీయ వివక్ష లేకుండా చూడాలని,

> “హీరోలు సీఎంలకు నమస్కారం పెట్టడం అవసరం లేదు. నిర్మాతలే చర్చలు జరపాలి. గతంలో ఎన్టీఆర్ గారి కాలంలో కూడా ఇలాంటి వివక్ష లేదు. ఇదే మనం నేర్చుకోవాలి,”
అని పేర్కొన్నారు.
……….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి